నవరత్నాలు -పేదలకు ఇల్లు;; ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకం

తూ. గో (కాకినాడ);;నవరత్నాలు - పేదలకు ఇళ్లు అనేది ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకమైనదని, తదనుగుణంగా ఎమ్ పిడిఓలు, తాహసిల్దార్లు పనిచేయాలని జిల్లా కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి తెలిపారు. బుధ వారం కలక్టరేట్ లో వివేకానంద హాలు నుందు జెసి జి.లక్ష్మీశతో కలిసి పెద్దాపురం డివిజన్ స్థాయి మండల అధికారులతో నవరత్నాలు - పేదలకు ఇళ్లు పనితీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలక్టర్ మాట్లాడుతూ మండల స్థాయిలో ఎమ్ పిడిఓ, తాహసిల్దార్లు సమన్వయంతో కృషి చేసి భూ సేకరణ, లబ్దిదారుల జాబితాలో ఎంపిక, లాటరీ తీయడం, లేఅవు వేయడం లాంటి ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్న పనులు భూమి చదును చేయడం, కచ్చా రోడ్లు వేయడం లాంటి పనులు మే 3వ తేదీ నాటికి పూర్తి చేసుకోవాలన్నారు. వీటికి సంబంధించిన బిల్లు త్వరితగతిన సమర్పించాలన్నారు. కోవిడ్-19 దృష్ట్యా కార్మికులు పనులు చేయడానికి ముందుకు వస్తారని, వారికి జీవనోపాధి కల్పించే విధంగా ఎమ్ పిడిఓ, డ్వామా అధి కారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గృహనిర్మాణలకు జిల్లా వ్యాప్తంగా 2250 కోట్ల రూపాయలు పెద్ద ఎత్తున హెచ్చిస్తుండడం వలన తగిన విధంగా అధికారులు పనిచేయాలన్నారు. నిధుల కొరత లేనందున భూ సేకరణ సంబంధించి పనులు పూర్తి చేసి లేఅవు పనులు పూర్తి చేయాలని తాహసిల్దార్లకు కలక్టర్ సూచించారు. కంటైన్మేంట్ బపర్ జోన్ తప్ప మిగిలిన ప్రాంతాలు సామాజిక దూరం పాటించి పనులు చేపట్టాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో అనేక పధకాలు అమలుపర్చవలసి వస్తునప్పటికి ఇళ్ల పట్టా పంపిణీ ప్రక్రియ త్వరితగతిని పూర్తి చేయాలని మండల స్థాయి అధికారులకు కలక్టర్ పలు సూచనలు చేసారు. ఈ సందర్భంగా కలక్టర్ పెద్దాపురం డివిజన్ పరిధిలో గండేపల్లి, జగ్గంపేట, కత్తిపూడి, ఏలేశ్వరం, పెద్దాపురం, రాగం పేట, తొండంగి, కోటనందూరు, తుని, శంఖవరం లతో పాటు మున్సిపాలిటీలో జరుగున్న భూ పంపిణీ పై జరుగుతున్న విధనాన్ని ఆయా మండల ఎమ్ పిడిఓలు, తాహసిల్దార్లు, సంబంధిత ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో డిఆర్ ఓ సిహెచ్.సత్తిబాబు, పెద్దాపురం ఆర్ డిఓ ఎస్.మల్లిబాబు, ఎస్.ఇ ఇరి గేషన్ నాగరాజు, డ్వామా పిడి ఎమ్.శ్యామల, పిడి హౌసింగ్ ప్రసాద్ లతో పాటు పెద్దాపురం డివిజన్ లోని ఎమ్ పిడిఓలు, తాహసిల్దార్లు, ఇంజనీర్లు, డ్వామా అధికారులు పాల్గొన్నారు.


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు