దిశ పోలీస్ స్టేషన్ సేవలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలి ;కలెక్టర్ మురళీధర్ రెడ్డి
తూ.గో ; కాకినాడలో నూతనంగా ఏర్పాటు చేసిన దిశ పోలీస్ స్టేషన్ సేవలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డి.మురధరరెడ్డి కోరారు. ఆదివారం ఉదయ కాకినాడలోని టుటౌన్ పోలీస్ స్టేషన్ భవనం పై అంతస్తులో నూతనంగా ఏర్పాటు చేసిన దిశ పోలీస్ స్టేషన్ ను జిల్లా కలెక్టర్ మురళీధరరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినం నాడు మహిళల రక్షణ, భద్రత కొరకు జిల్లా కేంద్రం కాకినాడ నగరంలో దిశ పోలీస్ స్టేషన్ ను ప్రారంభించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ, ఈ స్టేషన్ మహిళలలో ధైర్యం, ఆత్మవిశ్వాసాలను మరింత పెంపొందించ గలదన్నారు. గత నెల 8వ తేదీన రాష్ట్రంలో తొలి దిశ పోలీస్ స్టేషన్‌ను రాజమండ్రిలో ముఖ్యమంత్రి ప్రారంభించారని, నెల రోజుల్లో పే అన్ని సదుపాయాలు, సాంకేతిక హంగులతో రెండవ దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన జిల్లా ఎపి, పోలీస్ అధికారులను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. పొరుగు రాష్ట్రంలో జరిగిన దురదృష్టకరమైన అత్యాచారం, హత్య సంఘటన నేపద్యంలో, అటువంటి ఘోర దారుణాలు మన రాష్ట్రంలో జరుగకుండా, రాష్ట్ర ప్రభుత్వం దిశ చట్టాన్ని తెచ్చి, పటిష్ట అమలకు దిశ పోలీస్ స్టేషన్లు, వన్ స్టాప్ సెంటర్లు శరవేగంగా ఏర్పాటు చేస్తోందన్నారు.
టోల్ ఫ్రీ నెంబర్లు, దిశ వాట్సాప్ యాప్ ద్వారా ఆపదలో ఉన్న మహిళలు, బాలికలు సమాచారం అందిస్తే నిమిషాల్లో వారి రక్షణ చర్యలు చేపట్టి ఆదుకోవడం జరుగుతుందని, ఈ నెంబర్లు, యాప్లను మహిళలు తమ ఫోన్లలో ఉంచుకోవాలని కోరారు. గతంలో ఉన్న చట్టాల కంటే పటిష్టమైన దిశ చట్టం ద్వారా మహిళల పట్ల దారుణాలకు ఒడికట్టిన వారికి త్వరితగతిన కఠిన శిక్షలు పడతాయని, తద్వారా మహిళలతో అనుచితంగా ప్రవర్తించేందుకు ఎవరూ సాహసించరన్నారు. జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అద్నాన్ నయీమ్ అస్మి మాట్లాడుతూ 2020 సంవత్సరాన్ని మహిళ రక్షణ, భద్రతా సంవత్సరంగా పాటిస్తున్నామని, సమాజంలో సగ భాగంగా ఉన్న మహిళల రక్షణకు పోలీస్ శాఖ అత్యంత ప్రాముఖ్యతనిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ జి.లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్-2 జి.రాజకుమారి, ఓఎడ్ (ఆపరేషన్స్) అరీఫ్ హఫీజ్, అడ్మిన్ ఎపి కరణం కుమార్ , డిఎస్ పిలు, పోలీస్ సిబ్బంది, పాఠశాలల బాలికలు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి