భాదిత ఎస్ సి బాలికకు సత్వర న్యాయం, సహాయాలను అందిస్తాం ;రాష్ట్ర ఎస్సీ, ఎస్ కమీషన్ సభ్యులు డా. కె.నరహరి వరప్రసాద్

తూ. గో. ;మండ పేట సామూహిక అత్యాచార సంఘటన భాదిత ఎస్ సి బాలికకు సత్వర న్యాయం, సహాయాలను అందిస్తామని రాష్ట్ర ఎస్సీ, ఎస్ కమీషన్ సభ్యులు డా. కె.నరహరి వరప్రసాద్ తెలియజేశారు. ఆదివారం మద్యాహ్నం మండ పేట సామూహిక అత్యాచార సంఘటన బాధితురాలు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు డా. కె.నరహరి వరప్రసాద్ ను కాకినాడ ఆర్ అండ్ బి అతిధి గృహాంలో కలిసి దోషులకు కఠిన శిక్షలు వేసి, తనకు న్యాయం చేయాలని కోరింది. జరిగిన సంఘటన పట్ల కమీషన్ సభ్యులు వరప్రసాద్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఆమెకు అందించిన సహాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. బాధితురాలికి తక్షణ ఆర్ధిక సహాయంగా 4 లక్షలు మొత్తం అందజేశామని జిల్లా రెవెన్యూ అధికారి తెలియజేయగా, ఆమె విద్యార్హతలకు తగిన ఉద్యోగం కల్పించాలని కమీషన్ సభ్యులు సూచించారు. అలాగే ఆమె కోరుకున్న చోట 3 సెంట్ల ఇంటి స్థలం నెల రోజుల్లోపు కేటాయించాలని కోరారు. తనపై జరిగిన లైంగిక దాడి మరెవరి పైన జరగకుండా తీవ్ర హెచ్చరికగా ఉండేట్లు దోషులకు కఠిన శిక్షలు పడాలని ఫిర్యాదు చేసి ధైర్యంగా నిలబడిన బాధితురాలిని అభినందిస్తూ, ఆమెకు పోలిస్ రక్షణ కొనసాగించాలని, దోషులకు కఠిన శిక్షలు పడేలా పటిష్టంగా కేసు నమోదు చేయాలని పోలీస్ అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ లను కోరారు. ఈ సందర్భంగా బాధితురాలికి 25 కేజీల బియ్యం , రేషన్ సామాన్లు పంపిణీ చేసి, ప్రభుత్వ పరంగా అన్ని విధాల ఆదుకునేందుకు కమీషన్ ద్వారా కోరతామన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ ఓ సి హెచ్ .సత్తిబాబు, ఎస్సీ,ఎస్టి సెల్ డిఎస్ పి జి.ఏలియాసాగర్ , రామచంద్రపురం డిఎస్ పి యం.రాజగోపాలరెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడి యం.సనీత పాల్గొన్నారు. (సమాచార శాఖచే జారీ)


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు