మురికి నీటితో  ప్రవహిస్తున్న నాగావళి నది....... పట్టించుకోని శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు..

 


శ్రీకాకుళం  ;శ్రీకాకుళం పట్టణం మధ్యలో మురికి నీటితో  ప్రవహిస్తున్న నాగావళి నదిని శ్రీకాకుళం పట్టణ కార్పొరేషన్, శానిటేషన్, ఆరోగ్యశాఖ, అధికారులు పట్టించుకోవడం లేదు ,ముఖ్యంగా శ్రీకాకుళం పట్టణం ప్రజలు ఇంటిలో  వాడుక మురికి నీటిని అనేక కాలువల ద్వారా శ్రీకాకుళం నదిలో కలుస్తున్నాయి దీంతో నాగావళి నది పూర్తిగా కాలుష్యంతో కూడిక ఉన్నది, ఈ నీటిని అంతంత మాత్రంగా  శుద్ధి చేస్తున్నారు,  దీనివలన పట్టణ ప్రజలు అనేక జబ్బుల బారిన పడుతున్నారు , ముఖ్యంగా గత ప్రభుత్వం తెలుగుదేశం హయాంలో బలగా, కోడి రామ్మూర్తి క్రీడా ప్రాంగణం ఆనుకొని, కలెక్టర్ కార్యాలయం దగ్గర వాంబే కాలనీ వెనకాతల కొన్ని లక్షల రూపాయలతో మురికి నీటిని శుద్ధి చేసే బావులను యుద్ధ ప్రాతిపదికన నిర్మించారు, అయితే ఆ బావుల యొక్క  ముఖ్య ఉద్దేశం పట్టణంలో గల మురికినీటిని నాగావళి నదిలో నేరుగా కలవకుండా  ఈ బావుల్లో ఆ మురికి నీటిని పంపించి అక్కడి నుంచి ఆ బావుల్లో ఆ మురికి నీటిని శుభ్రపరిచి తిరిగి నాగావళి నదిలో పంపించడం కోసం ఏర్పాటు చేశారు, దీనికి కొన్ని లక్షల రూపాయలు ఖర్చయింది ,అయితే ఇంతలో ప్రభుత్వం మారటంతో ఎక్కడి పనులు అక్కడే నిలిపివేశారు, దీనివలన ఆ పథకం నీరుగారుతోంది, ఇప్పటికే పట్టణ ప్రాంత వాసులు  ప్రపంచంలో  అత్యంత భయంకరమైన కరోనా  వైరస్  బారినపడి జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు , ఎలాగైనా  శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, శానిటేషన్ అధికారులు, ఆరోగ్యశాఖ అధికారులు  నాగావళి నది పరిశుభ్రతకు  పెద్దపీట వేయాలని కోరుతున్నారు , మురికి నీటిని శుభ్రపరిచే బావులను వాడుకలోకి తెచ్చి ప్రజలకు అనారోగ్యం బారిన పడకుండా ఉండాలని ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు,


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు