ఏపీలో మరో మూడు కరోనా కేసులు..

శనివారం సాయంత్రానికి ఏపీలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 16కి చేరింది. చీరాలకు చెందిన ఓ జంటకు, కర్నూలు జిల్లాలో మరొకరికి కరోనా పాజిటివ్ అని తేలింది.






 





                                                                                      ఏపీలో మరో ముగ్గురికికరోనా వైరస్ సోకింది. ప్రకాశంలో జిల్లాలో భార్యాభర్తలు కోవిడ్ బారిన పడ్డారు. చీరాలకు చెందిన వ్యక్తి ఇటీవల ఢిల్లీ వెళ్లి వచ్చారు. నవాబ్‌ పేటకు చెందిన ఆయనతోపాటు, ఆయన భార్యలోనూ కరోనా లక్షణాలు కనిపించడంతో.. ఒంగోలు రిమ్స్‌లో చేర్పించారు. వారి నమూనాలను సేకరించి విజయవాడ పంపగా.. కరోనా పాజిటివ్ అని తేలింది. వీరిద్దరూ వృద్ధులు కావడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఒంగోలులో ఇప్పటికే మరో వ్యక్తికి కరోనా సోకిన సంగతి తెలిసిందే. ఆయన పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది.కర్నూలు జిల్లాలో తొలి కరోనా వైరస్ కేసు నమోదైందని జిల్లా కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు. సంజమల మండలం నోసంలో రాజస్థాన్ యువకుడికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. అతడు నోసం రైల్వేలో కాంట్రాక్టు పనులు చేస్తున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం అతడు కర్నూలులోని ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నాడు. దీంతో అతడు ఎవర్ని కలిశాడనే దిశగా అధికాులు దర్యాప్తు జరుపుతున్నారు. నోసం గ్రామం పరిసరాల్లోని 7 కి.మీ. ప్రాంతాన్ని బఫర్ జోన్‌గా పరిగణించారు. అతడు కలిసిన 52 మందిని కడప జిల్లా ప్రొద్దుటూరులో క్వారంటైన్‌లో ఉంచారు.ఏపీలో శుక్రవారం వరకు 13 కరోనా కేసులు నమోదు కాగా.. తాజాగా నమోదైన మూడు కేసులు కలిపితే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 16కు చేరింది. మరో వైపు తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 65కు చేరింది. కోవిడ్ బారిన పడి హైదరాబాద్‌లో ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడని ఆరోగ్య మంత్రి ఈటల రాజేంద్ర తెలిపారు.



కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు