పేదల ఇళ్ల దేశం లోనే సరికొత్త చరిత్ర ;సియంఓ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్
కాకినాడ (తూ .గో) ;నవరత్నాలు పేదలందరికి ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం దేశంలోనే సరికొత్త చరిత్ర సృష్టిస్తుందని సియంఓ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ తెలిపారు. శుక్రవారం ఇళ్ల స్థలాలకు సంబంధించి భూ సేకరణ క్షేత్ర స్థాయి పరిశీలన లో భాగంగా పిఠాపురం మండలంలో నరిసింగపురం గ్రామంలో 62 ఎకరరాల భూమి మరియు గొల్లప్రోలు గ్రామంలో సింహద్రి దొడ్డి వద్ద నున్న 34 ఎకరాల భూమిని కాకినాడ రెవెన్యూ డివిజన్ అధికారి ఎజి.చిన్నికృష్ణతో కలిసి పరిశీలించారు. అనంతరం పిఠాపురం మున్సిపల్ కళ్యాణ మండపం వద్ద మరియు గొల్లప్రోలు మండల కార్యాలయంలో ను కుమారపురం, నర్సిగపురం, నవకాండ్రవాడ, గొల్లప్రోలు, చేబ్రోలు గ్రామాలకు చెందిన రెవెన్యూ, గ్రామ సచివాలయ సిబ్బంది మరియు వాలంటీర్లతో సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ ప్రకాష్ మాట్లాడుతూ వచ్చే మార్చి 25వ తేదీన జిల్లాలో ఇవ్వనున్న పేదలందరికి ఇళ్ల స్థలాల భూసేకరణ ను అధికారులు త్వరిత గతిన పూర్తి చేయాలన్నారు. నవరత్నాలు, పేదలందరికి ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి తూర్పుగోదావరి జిల్లా నుండే ప్రారంభించనున్నారన్నారు.
పేదలకిచ్చే ఇళ్ల స్థలాల పై లబ్ధిదారులకు పూర్తి హక్కు కల్పించడంతో పాటు లబ్దిదారుని పేరుమీదుగా రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వడం జరుగుతుందన్నారు. 5సంవత్సరాల తరువాత లబ్ధిదారుడు ఈ ఆస్తిని ఏ విధంగానైన ఉపయోగించుకోవచ్చున్నారు. పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాలు అపార్టుమెంట్ రూపంలో కాకుండా వ్యక్తిగత ఇళ్ల స్థలాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఇంత పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం మరి ఎక్కడ జరుగలేదని దేశంలోనే ఇదోక చరిత్ర సృష్టిస్తుందన్నారు.వాలంటీర్లు తమ గ్రామంలో భూములందుబాటులో వుండి ఆసక్తిగా వున్న భూయాజమానులతో సంప్రదించి వారి వివరాలు ఇవ్వాలన్నారు. భూసేకరణలో భూమి ఇచ్చే వారికి ప్రభుత్వం మార్కెట్ ధరకు రెండున్నర రెట్టు అదనంగా పరిహారం ఇస్తారని తెలిపారు. భూమి ఇచ్చే యాజమానులకు టేక్స్ మినహింపుతో పాటు ఈ నెల 25వ తేదీలోగా డబ్బులు చెల్లించే విధంగా ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
వాలంటీర్లు లబ్ధిదారులను వారికి ఇవ్వనున్న ఇళ్ల స్థలాల వద్దకు తీసుకువెళ్లి చూపించాలన్నారు. పేద వారు ఏ ఒక్కరు తప్పి పోకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలం ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలక్టర్ ఎన్.సుగుణకుమారి, పిఠాపురం, గొల్లప్రోలు మండల తాహసిల్దార్లు జి.వరహలయ్య, వి.సీత, గొల్లప్రోలు ఎమ్ పిడిడి హెచ్.హరిప్రియ, పిఠాపురం, గొల్లప్రోలు మున్సిపల్ కమీషనర్లు ఎన్.వి నాగేశ్వరరావు, సర్వేయర్లు, విఆర్ఓలు, గ్రామసచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి