కులాంతర వివాహం చేసుకుందని ఉరి ...

తూ . గో ;జిల్లాలోని మామిడికుదురు మండలం అప్పనపల్లిలో అమానుషం చోటు చేసుకుంది. కులాంతర వివాహం చేసుకున్న కడలి శాంతి అనే మహిళపై ఆమె అత్తమామలు మంగళవారం హత్యాయత్నం చేశారు. కర్టెన్ తాడుతో మహిళకు ఉరివేసేందుకు ప్రయత్నించగా ఆమె పెద్దగా కేకలు వేసింది. దీంతో అత్తమామలు ఆమెను కాలితో పొత్తి కడుపులో తన్నారు. బాధిత మహిళ కేకలు విన్న చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని వారిని అడ్డుకోగా ఆమె ప్రాణాలతో బయటపడింది. కాగా శాంతి యూరినల్ ఆగిపోవడంతో ఆమెను హుటాహుటిన రాజోలు ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్సనందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కాకినాడకు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు