పారిశూధ్య కార్మికులకు  ఆరోగ్యంపై నిర్లక్ష్యం తగదు వెంటనే శానిటరీ సెఫ్టీ మెటీరియల్‌ అందజేయాలి ఎంఎంజెఎస్‌ జాతీయ కార్యదర్శి కుమార్‌


సామర్లకోట,అక్షర లీడర్‌ ప్రతినిధి :ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికుల  ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహించడం సరికాదని మాదిగ మహాజన సంఘం (ఎంఎంజెఎస్‌ )జాతీయ సహాయ కార్యదర్శి కాపవరపు కుమార్‌ మాదిగ ఆందోళన వ్యక్తం చేసారు. స్థానిక సామర్లకోట పట్టణం పురపాక సంఘ కార్యాయంలో పురపాక సంఘం డిఇని మంగళవారం కలిసి కార్మికుల  ఆరోగ్య భద్రతపై  వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కుమార్‌ మాదిగ మాట్లాడుతూ ప్రపంచమంతా కరోనా వైరస్‌కు  భయపడి జీవనం కొనసాగిస్తున్న తరుణంలో పారిశుద్ధ్య కార్మికులు  ప్రజా ఆరోగ్యమే ద్యేయం ప్రాణాలు  కూడా లెక్క చేయకుండా విధులు  నిర్వహిస్తున్నారని వారు చేస్తున్న వృత్తిని గౌరవిస్తూ అనేక ఇబ్బందుల కు లనవుతున్నారన్నారు.విధి నిర్వాహణలో కార్మికులకు  అంటురోగాలకు గురవుతూ ఉంటున్న తరుణంలో ఈ కరోనా వైరస్‌ను   లెక్కచేయకుండా తమ వృత్తిని ప్రేమిస్తూ నభూతోనభవిష్యతిగా ముందుకు పోతుంటే కనీసం వారికి శానిటరీ సేఫ్టీ మెటీరియల్‌ ఇవ్వకపోవడం చాలా దారుణమని ప్రజా ఆరోగ్యాన్ని కాపాడే వీరి ఆరోగ్యంతో చెగాటం తగదని కుమార్‌ ప్రభుత్వానికి సూచించారు.వెంటనే ఈ విషయంపై స్పందించి ప్రభుత్వం వీరిని అన్ని రకాుగా ఆదుకోవాల ని వీరికి శానిటరీ సేఫ్టీ మెటీరియల్‌తో పాటు కరోనా  వైరస్‌ కారణంగా ఆ సమయానికి సంబంధించి ప్రత్యేక జీతం కూడా కేటాయించాల ని కాపవరపు కుమార్‌ మాదిగ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో  మాదిగ సంఘం రాష్ట్ర అధ్యక్షు ముప్పిడి దైవ వరప్రసాద్‌,రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు  విప్పర్తి సుశీ,రాష్ట్ర నాయకు మసకపల్లి రాజు,సురేష్‌,కందుకూరి రమణ,దన్నిన నవీన్‌ తదితయి పాల్గొన్నారు.


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు