భూములు ఇవ్వండి ;ప్రత్యమ్నాయ భూములిస్తాము

కాకినాడ ;కడియం ఇండస్ట్రీయల్ పార్కు సంబంధించిన భూములను పేదవాళ్ల ఇళ్ల నిర్మాణానికి ఇచ్చిన చిన్న, మద్య తరహా పరిశ్రమల దారులకు వారికి ప్రత్యామ్నాయ భూములు అందించడం జరుగుతుందని కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి తెలిపారు. గురువారం కలక్టర్ కార్యాలయ సమావేశం మందిరంలో కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి సమక్షంలో కడియం ఇండస్ట్రీయల్ పార్కు జాయింట్ యాక్షన్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కడియం మండలం జేగురుపాడు, వేములపల్లి గ్రామాల్లో ఎపిఐఐసి చెందిన భూముల్లో భూములు కోల్పోయిన వారికి కోరుకొండ మండలం నిలగట్ల గ్రామంలో ఇప్పటికి 40 ఎకరాలు గుర్తించడం జరిగిందన్నారు. వీటిని మరింతగా అభివృద్ధి పరిచి మొత్తం 100 ఎకరాల భూమిని సేకరించి చక్కటి పారిశ్రామిక వాడ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందింస్తున్నామన్నారు. పేదల ఇళ్ల నిర్మాణానికి తమ భూములను ప్రభుత్వానికి ఇచ్చిన 197మంది రైతులకు తగిన విధంగా ప్రభుత్వ పరంగా న్యాయం చేస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా భూములకు సంబంధించి ఎన్ ఓసిలను రైతులు కలెక్టరుకు అందించారు. ఈ సమావేశంలో ఎపిఐఐసి జోనల్ మేనేజర్ ప్రసాద్, కడియం ఇండస్ట్రీయల్ డవలప్ మెంట్ అడ్వజర్ ఎన్.వెంకటరావు, జెఎసి ఏసిండెంట్ జామ.రమణలు పాల్గొన్నారు. జారీ)


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు