karona; నెల రోజుల్లో...అమెరికా..సీన్ రివర్స్
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య బుధవారం మధ్యాహ్నం నాటికి 4.23 లక్షలు దాటింది. కోవిడ్ మహమ్మారి బారిన పడి ఇటలీ విలవిల్లాడుతుండగా.. స్పెయిన్, ఫ్రాన్స్, అమెరికాల్లోనూ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. చైనా, ఇటలీ తర్వాత కరోనా కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్న దేశంగా అమెరికా నిలిచింది. అగ్రరాజ్యంలో కరోనా బాధితుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. అమెరికాలో 54 వేల మంది కోవిడ్ బారిన పడగా.. 784 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా వ్యాప్తి అమెరికాలో ఊహించని స్థాయిలో ఉండటంతో ట్రంప్ సర్కారు ఆందోళనలో ఉంది. కరోనా కేసుల సంఖ్య ఇదే రీతిలో పెరిగితే.. త్వరలోనే ఆ దేశం చైనా, ఇటలీలను మించిపోతుందని భావిస్తున్నారు. మొదట కరోనాను తేలిగ్గా తీసుకోవడమే ఈ పరిస్థితికి దారి తీసిందనే భావన వ్యక్తం అవుతోంది. రోజురోజుకూ పరిస్థితి దిగజారుతుండటం అమెరికన్లను కలవరానికి గురి చేస్తోంది. చైనా వల్లే కరోనా వైరస్ వ్యాప్తి చెందిందని డొనాల్డ్ ట్రంప్ ఆరోపిస్తున్నారు.
అమెరికాలోని కీలక నగరమైన న్యూయార్క్ కోవిడ్‌కు కేంద్ర స్థానంగా మారింది. న్యూయార్క్‌లో 25,600 మందికిపైగా కరోనా బారిన పడగా, దాదాపు 200 మంది చనిపోయారు. ఇక్కడ ప్రతి రెండు మూడు రోజులకు కరోనా బాధితుల సంఖ్య రెట్టింపు అవుతోంది. బుల్లెట్ ట్రైన్ స్పీడ్‌తో ఒక్క కోవిడ్ విజృంభిస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. మరో రెండు మూడు వారాల్లో న్యూయార్క్‌లో పరిస్థితి చేజారిపోతుందనే ఆందోళన వ్యక్తం అవుతోంది. కోవిడ్ కట్టడి కోసం న్యూయార్క్ నగరాన్ని దాదాపుగా లాక్‌డౌన్ చేశారు. న్యూయార్క్‌కు వెళ్లి వచ్చిన వారు, ఆ నగరం నుంచి వెళ్తున్నవారు 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉండాలని అమెరికా ప్రభుత్వం సూచిస్తోంది.
రాష్ట్రాల వారీగా ఇలా..
అమెరికాలో కరోనా ప్రబలుతున్న తీరు చూసిన తర్వాత 21 రోజులపాటు దేశంలో లాక్‌డౌన్ విధిస్తూ ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం సరైందేనని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. నెల రోజుల క్రితం ట్రంప్ ఉపేక్షించిన విధంగానే మోదీ కూడా వ్యవహరిస్తే.. మనదేశంలో కొన్ని కోట్ల మంది కరోనా బారిన పడేవారు. మరణాల సంఖ్య కూడా లక్షలను దాటి కోట్లలో ఉండేది. మన దగ్గర జనాభా, జనసాంద్రత ఎక్కువ కావడమే దీనికి కారణం. కానీ మోదీ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారనే భావన వ్యక్తం అవుతోంది. ఈ 21 రోజులపాటు ప్రజలు లక్ష్మణ రేఖ దాటి బయటకు రాకుండా.. ఇళ్లలో ఉంటే చాలు.. దేశాన్ని కాపాడిన వాళ్లం అవుతాం.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి