ఏపీ లో కరోనా.. కలెక్టర్లతో ముఖ్యమంత్రి జగన్ ... పలు అభివృద్ధి అంశాలపై వీడియో కాన్ఫెరెన్స్
ఏపీ 'పొరుగు రాష్ట్రంలో కరోనా వైరస్ కేసు నమోదైన నేపద్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అరోగ్యపరమైన అప్రమత్తత పాటించి ముందస్తు జాగ్రత్తలు, అవగాహనా కార్యక్రములు విస్తృతంగా చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహనరెడ్డి జిల్లా కలెక్టర్లను కోరారు. మంగళవారం ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి జిల్లా కలెక్టర్లు, ఎస్.పి.లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పేదలందరికీ ఉగాది నాడు ఇళ్ల స్థలాల పంపిణీ, కరోనా వైరస్ పట్ల అప్రమత్తత, స్థానిక సంస్థల ఎన్నికలను స్వచ్ఛమైన, ఆదర్శవంతమైన రీతిలో నిర్వహణకు తెచ్చిన ప్రత్యేక ఆర్డినెన్స్ అమలుపై ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం కొరకు సేకరించిన భూముల సేకరణ, లెవెలింగ్ , లేఅవట్ ప్రక్రియను ఈ నెల 10 నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను కోరారు. లాటరీ ద్వారా లబ్దిదారులకు ఇళ్ల స్థలాలలు కేటాయించి, కేటాయించిన ప్లాట్ లో లబ్దిదారుడు నిలబడి ఉండగా ఫోటో తీయించి జియోటాగింగ్ చేయించాలని ఆయన తెలిపారు. ఇంటి స్థలం నిర్మించే ఇల్లు ఇచ్చే తృప్తి జి-ప్లస్ గ్రూప్ హౌస్ ఇవ్వదని, లబ్ధిదారులందరికీ ఇంటి స్థలాలలనే పంపిణీ చేయాలని మరోమారు స్పష్టం చేశారు. అర్బన్ లబ్దిదారులకు కేటాయించే సెంటు ఇంటి స్థలాలు 22 అడుగులు బై 22 అడుగులు కొలతలు ఉండేట్లు చూడాలని సూచించారు. సేకరించిన ప్రభుత్వ, ప్రయివేట్ స్థలాల లెవెలింగ్ కు వివిధ శాఖల ఇంజనీర్లు, సిబ్బంది సేవలను వినియోగించుకోవాలని ఈ నెల 10వ తేదీ నాటికి లేఅవుట్లు పూర్తి చేసి స్థలాల కేటాయించాలన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన కేసులు ఏక్కడా నమోదు కాలేదని, అయితో పొరుగున ఉన్న తెలంగాణాలో ఒక కేసు, రాష్ట్రం నుండి రాకపోకలు ఎక్కవగా ఉన్న గల్ఫ్ దేశాలలో వైరస్ ఉనికి గుర్తించినందున, రాష్ట్ర వ్యాప్తంగా అరోగ్య పరమైన అప్రమత్తత పాటించాలని ముఖ్యమంత్రి కోరారు. కరోనా వైరస్ ఎలా సోకుతుంది, సోకినపుడు ఎటువంటి లక్షణాలు కనబడతాయి, రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాల పై వైద్య ఆరోగ్యం, సమాచార శాఖల ద్వారా ప్రజలలో విస్తృత అవగాహన పెంపొందించాలని, కరోనా వైరస్ గురించిన సమాచారం, జాగ్రత్తలు ముద్రించిన కరపత్రాలను అన్ని గ్రామ, వార్డు సచివాలయాలలో ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఆసుపత్రులలో ఐసోలేషన్ వార్డులను సిద్ధం చేయాలని, అవసరమైనన్ని బాడీ, ముఖం మాస్క్లను కొనుగోలు చేయాలని సూచించారు. కరోనా వైరస్ కోబిడ్-19 ముప్పు ఎదురైతే సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లాల స్థాయిలో సమన్వయ కమిటీలు వేసి, రాపిడ్ యాక్షన్ టీములను సంసిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కలెక్టర్లను ఆదేశించారు. 14వ ఆర్థిక సంఘం నిధులు స్థానిక సంస్థలకు విడుదల అంశం వాటి ఎన్నికల నిర్వహణతో ముడిపడి ఉన్నందున, న్యాయస్థానం సూచనల మేరకు ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాల్సి ఉందని, ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లను కోరారు. స్థానిక సంస్థల ఎన్నికలలో ధనం, మద్యం ప్రభావం నిరోధించేందుకు ప్రత్యేక ఆర్డినెన్స్ తెచ్చామని, డబ్బు, మద్యం పంచిన వారిని అనర్హులుగా ప్రకటించడమే కాక, మూడేళ్ల జైలు శిక్షను నిర్దేశించడం జరిగిందన్నారు. ఈ ఆర్డినెనను పటిష్టంగా అమలు పరచడం ద్వారా దేశంలో రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలిపాలని ఆయన కలెక్టర్లు, ఎస్పీలను కోరారు. సార్వత్రిక ఎన్నికలలో వాడిన విజిల్ తరహా యాప్ను రూపొందించాలని,
సచివాలయాల్లోన్ని మహిళా పోలీసులు, పోలీస్ మిత్రల సహకారంతో గ్రామ స్థాయి నుండి ఆర్డినెన్స్, యాన్ల పై అవగాహన పెంపొందించాలని ఆయన కోరారు. మీ ఫించను...మీ గడప వద్ద కే కార్యక్రమం క్రింద మార్చి-1వ తేదీన ఒక్క రోజునే 98 శాతం పింఛన్లు పంపిణీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, వచ్చే నెల 1వ తేదీన రెండు గంటలలో నూరు శాతం పింఛన్ల పంపిణీ చేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ డి.మురళీధరరెడ్డి, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అద్నాన్ నయీమ్ అస్మి, జాయింట్ కలెక్టర్ జి.లక్ష్మీశ, డిఆర్ ఓ సిహెచ్ .సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి