విజయవాడ : ఏపీ ముఖ్యమంత్రి జగన్ గవర్నర్ బిశ్వభూషణ్‌ను కలిశారు. రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు వాయిదా పడిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై గవర్నర్‌తో సీఎం చర్చించనున్నట్లు సమాచారం. పూర్తిస్థాయిలో బడ్జెట్ సమావేశాల నిర్వహణపై చర్చించే అవకాశం ఉంది.కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ఆరు వారాలపాటు రాష్ట్ర ఎన్నికల సంఘం వాయిదా వేసిన విషయం తెలిసిందే.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి