పిఠాపురం లో హోమియో ఫిజియోథెరపి విభాగము
హోమియో ఫిజియోథెరపి విభాగము ప్రారంభము పిఠాపురం లో గత 29 సంవత్సరములుగా హోమియో వైద్య సేవలు అందించుచున్న మొహిద్దీన్ బాదుషా మెమోరియల్ మల్టీ స్పెషాలిటీ హెూమియో క్లినిక్ నందు 12-3-2020 నాడు హెూమియో జియోథెరపీ విభాగమును , క్లినిక్ వ్యవస్థాపకులు , శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా ప్రారంభించారు. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ " ఘోమియో వైద్య విధానములో కీళ్లు , నరములు , కండరముల సంబంధిత వ్యాధులకు , పక్షవాతము , ఆటలవలన సంభవించు దెబ్బలకు చక్కని వైద్యము కలదని దానితో పాటుగా జియోథెరపీ జోడించి వినియోగించుకుంటే రోగులకు మరింత త్వరితగతిని ఉపశమనము కల్పించవచ్చునని అన్నారు. హెూమియో ఫిజియోథెరపీ ద్వారా ఒక రోగి వచ్చినప్పుడు హోమియో వైద్యులు మరియు ఫిజియోథెరపీ వైద్యులు కలిసి ఆలోచించి అనంతరము వారి సమిష్టి కృషి పై వైద్యము చేయుట వలన రోగకి మంచి ఫలితాలు వస్తాయని అన్నారు. హెూమియో ఫిజియోథెరపీ అనే వినూత్న విధానం ప్రప్రధమముగా తమ క్లినిక్ నందు నెలకొల్పడము జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఘోమియో వైద్య నిపుణులు డా ఆనంద కుమార్ పింగళి , ఫీషియోథెరపీ నిపుణులు డా . వెంకట ఫణింద్ర కృష్ణ , డా . అమ్మాజీ పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి