కరోనా ; సామర్లకోట రైల్వే స్టేషన్లో వారణాసి నుండి వచ్చిన యాత్రికులు ;వీరంతా కాకినాడసమీపంలోని కరప గ్రామ వాసులు
తూ. గో.జిల్లా ;తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట రైల్వే స్టేషనలో వారణాసి నుంచి సామర్లకోట చేరుకున్నయాత్రికులు ఆదివారం ఒక రైలు నుండి దిగడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు . వారణాసి నుంచి సామర్లకోట చేరుకున్నఈ యాత్రికులు కాకినాడ రురల్ మండలం కరప గ్రామానికి చెందిన వారు . సుమారు 60 మంది యాత్రికులలో స్త్రీలు, పురుషులు ఉన్నారు. యాత్రికుల యోగ క్షేమ వివరాలను వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఫోన్లో అడిగి తెలుసుకున్నారు. వీరిని వైద్యపరీక్షల నిమిత్తము కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి