విశాఖకు చైనా షిప్ ; కరోనా భయం; విశాఖ నావి హైఅలెర్ట్

విశాఖ తీరానికి చైనా షిప్ గత రాత్రి చేరుకుంది. అయితే కరోనా ఎఫెక్ట్‌తో నావీ అధికారులు ఎవరూ షిప్‌ను పోర్టులోకి అనుమతించలేదు. షిప్‌లో మొత్తం 22 మంది ఉన్నారు. అందులో 17మంది చైనా వాసులు కావడంతో అందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.                                                             






  • తెలుగు రాష్ట్రాల ప్రజలు కరోనా పేరు వింటేనే భయపడిపోతున్నారు. తెలంగాణలో ఒక్క పాజిటివ్ కేసు నమోదు కావడంతో... ఏపీ ప్రభుత్వం సైతం అలర్ట్ అయ్యింది. కరోనా తమ రాష్ట్రంలో రాకుండా జగన్ సర్కార్ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటోంది. అయితే కరోనాకు బీజం పడిన చైనా దేశం నుంచి ఓ షిప్ తాజాగా విశాఖ తీరానికి చేరుకుంది. దీంతో ఇప్పుడు విశాఖ వాసులు భయపడిపోతున్నారు. విశాఖపట్నం పోర్టుకి గురువారం రాత్రి ‘ఫార్చ్యూన్ హీరో’ అనే చైనా కార్గో షిప్చేరుకుంది. షిప్ లో మొత్తం 22 మంది సిబ్బంది ఉన్నారు. అందులో 17 మంది చైనావాసులు ఉండగా... ఐదుగురు మయన్మార్ కి చెందిన వారున్నారు. అయితే కరోనాతో అలర్ట్ అయిన అధికారులు షిప్ ను పోర్టులోకి రాకుండా దూరంగానే నిలిపివేశారు.

                                                                                                      చైనా నుంచి బయలుదేరిన ఫార్చూన్‌ ఫ్రెం డ్‌ అనే నౌక విశాఖ పోర్టుకు చేరుకుంది. అయితే షిప్‌ తీరానికి సమీపంలోకి రావడంతో పోర్ట్‌కి రావడానికి అధికారులు అనుమతి నిరాకరించారు. చైనా షిప్‌ను అనుమతించేందుకు పారాదీప్ పోర్టు అనుమతి నిరాకరించింది. దీంతో విశాఖ తీరానికి ఈ షిప్ చేరుకుంది. అయితే అందులో వచ్చిన వారికికరోనా వైరస్ ఏమైనా సోకిందా ? అన్న అనుమానాంతో ఒడ్డుకు రావొద్దని పోర్టు అధికారులు ఆంక్షలు విధించారు. శుక్రవారం వీరికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. విశాఖ పోర్టుకు రావడానికి నెల క్రితమే అనుమతి తీసుకున్నారు. ఈ నౌకలో ఒడిశాకు చెందిన వ్యాపారులు పెట్ కోక్‌ను దిగుమతి చేసుకున్నారు.అయితే గురువారం సాయంత్రమేచైనాషిప్   విశాఖకు చేరుకున్నా... బెర్తింగ్‌ అనుమతి కోసం సముద్రంలోనే అవుటర్‌ హార్బర్‌‌లో వేచి ఉం ది. దీనికి కస్టమ్స్‌ క్లియరెన్స్‌ లభించాక బెర్తు కేటాయించి పోర్టులోకి అనుమతిస్తారు. వీరిలో ఎవరికైనా అనారోగ్యం ఉంటే నౌక కెప్టెన్‌ ముందుగానే తెలియజేస్తారు. కరోనా పరీక్షలు ప్రారంభించిన తరువాత ఏదైనా నౌక వస్తే... పోర్టు వైద్యాధికారుల బృందం వెళ్లి అందులో అందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది. తాజాగా చైనా నుంచి వచ్చిన షిప్‌లో ఉన్నవారి ఆరోగ్య పరిస్థితిపైనా ఇప్పటివరకు స్పష్టత లేకపోవడంతో పోర్ట్‌కి రావడానికి అనుమతివ్వలేదు. మరోవైపు ఈ షిప్‌ను ముందు జాగ్రత్తగా తిరిగి వెనక్కి పంపాలని పోర్టు వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు కరోనా పేరెత్తితేనే ఏపీ, తెలంగాణల్లో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అలాంటిది ఏకంగా కరోనా కల్లోలం సృష్టించిన చైనా నుంచి వచ్చిన షిప్ విశాఖకు రాగానే.. ఇటు ప్రభుత్వ యంత్రాంగంతో పాటు... అటు సామాన్య జనం కూడా మరింత కంగారు పడుతున్నారు.





కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు