ప్రపంచ హితం ప్రతిష్ఠాన ఆశయం: ఫణిశర్మ


  •  కాకినాడ : వేద విజ్ఞాన ప్రతిష్ఠానం శ్రీవిద్యాపీఠ వ్యవస్థాపకులు శ్రీ చెఱుకుపల్లి వెంకట లక్ష్మినృశింహశ్మ ఆధ్వర్యంలో లోక కళ్యాణార్ధం వారం రోజులుపాటు స్థానిక వేదవిజ్ఞాన ప్రతిష్టాన కార్యాలయ ప్రాంగణంలో ప్రత్యేక హెూమాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని విద్యాపీఠ ఉపాధ్యక్షులు బాలత్రిపురసుందరి జ్యోతిష్యాలయ అధినేత డా. ఫణిశర్మ (రాజమండ్రి)అన్నారు. ఈ హెమ కార్యక్రమాలను చెఱుకుపల్లి దంపతులు జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు. అనతంరం డా.చెఱుకుపల్లి ఆధ్వర్యంలో రాష్ట్ర నలుమూలనుండి వచ్చిన ప్రముఖు ఋత్విక్ లచే శ్రీ ఖడ్గమాల అనుష్ఠాన యాగ సహిత చండిమంలో భాగంగా లక్ష్మి గణపతి హోమం, మన్యుసూక్త హోమం, గాయత్రీ భువనేశ్వరి, కాళీ హోమం, రాజస్యామల హెమం, శ్రీసూక్త సహిత లక్ష్మి సంపుటీకరణ హోమం, రుద్రహోమం, సూర్యనామం ఘనంగా జరుగుతోందని చెప్పారు. స్త్రీలందరికి మంత్ర సహిత శ్రీ చక్రాన్ని ఉచితంగా అందిస్తున్నట్లు ఫణిశర్మ తెలిపారు. కార్యక్రమంలో కామెశ్వర శర్మ, దత్తాత్రేయ, మూర్తి, వెంకట్ పలువురు పాల్గొన్నారు. ఈ నెల 16వ తారీఖు మహా పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుందని భక్తులగురు పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తిచేసారు. ఇతర వివరాలకు చెఱుకుపల్లి వెంకట లక్ష్మినృశింహశర్మ 9441093592, ఫణిశర్మ 9440490999లో సంప్రదించవచ్చన్నారు.


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు