వేట్లపాలెం గ్రామంలో మొదలైన ఎన్నికల సందడి.... ; ప్రచారంలో ముందున్న గోలి శ్రీరామ్‌


సామర్లకోట,(తూ.గో ) :పెద్దాపురం నియోజకవర్గంలో రాజకీయ చిత్రపటాన్నే శాషించే వేట్లపాలెం గ్రామంలో పంచాయితీ ఎన్నిక  వాతావరణం ఆరంభమైంది.ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి స్థానిక సంస్థ ఎన్నికకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో గ్రామాల్లో ఎన్నిక హడావుడి మొదయింది.నియోజకవర్గంలో రాజకీయ వేడి ఎక్కువగా ఉండే వేట్లపాలెం గ్రామంలో ఎన్నిక సందడి ముందుగానే మొదయింది.మాజీ ఎంఎల్‌ఏ బొడ్డు భాస్కరరామారావు కనుసన్నలో ఉండే ఈ గ్రామంలో బొడ్డు ముఖ్య అనుచరుడు,మాజీ ఉప సర్పంచ్‌ గోలి వెంకట్రావు,మాజీ ఎంపిపి గోలి వెంకటలక్ష్మీ  తనయుడు గోలి శ్రీరామ్‌ ఈ సారి పంచాయితీ సర్పంచ్‌  రేసులో ఉన్నాడు.ప్రస్తుతం స్దబ్దతగా ఉన్న బొడ్డు రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికి అయన అనుచరులు అసెంబ్లీ ఎన్నికల  నుండి వైసిపిలో కీకపాత్ర పోషిస్తున్నారు.


ప్రస్తుతం గోలి వెంకట్రావు అయన అనుచరులు  వైఎస్సార్‌సిపిలో కోనసాగుతున్నారు.బరిలో ఉన్న శ్రీరామ్‌ గత ఎన్నికలో వైసిపి అభ్యర్ది తోట వాణి విజయానికి విశేషకృషి చేసి పార్టి కార్యక్రమాలలో చురుగ్గా పాల్గోంటున్నాడు.ప్రస్తుతం అటు రాష్ట్రంలోనూ,ఇటు నియోజకవర్గంలోనూ యువత రాజకీయాలో చురుగ్గా రాణిస్తుండటంతో శ్రీరామ్‌ సర్పంచ్‌ బరిలో నిలిచాడు.గ్రామంలో మేజారిటీ యువత శ్రీరామ్‌ నాయకత్వాన్ని బపరుస్తుండటం,మరోప్రక్క బొడ్డు భాస్కరరామారావు ఆశీస్సులు  మెండుగా ఉండటంతో శ్రీరామ్‌కు గ్రామంలో ప్రజల  ఆదరణ పెరుగుతుంది.మరో ప్రక్క గోలి వెంకట్రావు గ్రామంలో అందరికి తల లో నాలుకలా ఉండటం గతంలో ఆయన టిడిపిలోనూ, భార్య ఎపిపిగా,తాను గ్రామ ఉప సర్పంచ్‌గా చేసిన సేవలు వారి విజయానికి సులువైన మార్గాుగా కనిపిస్తున్నాయి.ఈ సందర్బంగా తనయుడు శ్రీరామ్‌ సర్పంచ్‌ బరిలో నిలిచి గ్రామాన్ని అభివృద్ది చేయానే సంకల్పంతో  ఎన్నికల  ప్రచారాన్ని ప్రారంభించారు.దీనిలో భాగంగా బుధవారం ఇంటింటికి తిరుగుతూ అవ్వ తాతల తో పాటు  ప్రతీ ఒక్కరిని పేరు పేరునా పిలుస్తూ  వచ్చే పంచాయితీ ఎన్నికలలో మీ ఓటు తనకే వేయాలని, ఒక్క అవకాశం  కల్పించాలని ఓటర్లను కోరుతూ ముందడుగు వేస్తున్నారు.దీంతో ఎన్నికల  ప్రచారంలో ముందున్న శ్రీరామ్‌కు గ్రామంలో యువకులు  మద్దతుతో పాటు గ్రామస్తుల  ఆదరణలతో గ్రామంలో ఎన్నిక పండగ వాతావరణం  నెలకొంది.                                                            . 


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు