నిత్యవసర వస్తువులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటాయి ప్రజల ఆరోగ్యమే ముఖ్యంగా అవసరమైన సేవలు అందిస్తున్నాం;రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు


  విశాఖపట్నం,మార్చి,28ః రాష్ట్ర ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వానికి ముఖ్యమని, ఎవరూ కరోనా బారిన పడకుండా సామాజిక దూరాన్ని పాటించాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతి శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు స్పష్టం చేశారు.  శనివారం ఉదయం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన రైతు బజారును విఎంఆర్డిఎ అధ్యక్షులు ద్రోణంరాజు శ్రీనివాసరావు, ఎల్.శివశంకర్ లతో కలసి ఆయన పరిశీలించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్కడి వ్యాపారస్తులతో చర్చించినపుడు పలువురు వ్యారస్తులు మంత్రితో మాట్లాడుతూ ఎండలలో ఎక్కువ సేవు ఉండలేకపోతున్నామని, టెంట్లు వేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని మంత్రిని కోరారు. తగు చర్యలు తీసుకోవలసినదిగా జాయింట్ కలెక్టర్ ఎల్. శివశంకర్ కు మంత్రి సూచించారు.  అదే విధముగా రైతు బజారుకు వచ్చిన పలువురు కొనుగోలుదారులు మంత్రితో మాట్లాడారు.  తదుపరి మంత్రి తనను కలసిన విలేకరులతో మాట్లాడుతూ నిత్యవసర సరకుల కొరకు ప్రజలు ఇబ్బంది పడరాదని, అందుకు ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోందన్నారు.  జిల్లాలో రైతు బజార్లను వికేర్రీకరించి స్థానికంగా ఉన్న మైదానాలలో మార్కెట్లను ఏర్పాటు చేసి ప్రజలకు ఎక్కడికక్కడే అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.  ప్రజల రద్దీని దృష్టిలో పెట్టుకొని నగరంలో మొత్తం 40 వరకు రైతు బజార్లను ప్రజలకు ఎక్కడికక్కడే అందుబాటులోకి తెచ్చామన్నారు.  ప్రజలందరూ వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కోవిడ్-19  వ్యాధికి గురి కాకుండా ఉండడానికి సామాజిక దూరం పాటించాలన్నారు.  నిత్యవసరాల ధరలు పెరుగుతాయని ఎవరూ ఆందోళన పడవద్దని చెప్పారు.  రెవెన్యూ, పోలీసు, వైద్య ఆరోగ్య శాఖ మొదలైన అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది ప్రజలకు ఎటువంటి యిబ్బంది కలుగరాదని, నిత్యం సేవలందిస్తున్నారని వివరించారు.  విక్రయ దారులు ఎండకు గురికాకుండా షామియానాలను ఏర్పాటుగావిస్తామన్నారు.  15 మొబైల్ రైతు బజార్లను అందుబాటులోకి తెస్తామన్నారు.  అపోహాలను ఎవరూ నమ్మవద్దన్నారు.  కరోనా నుండి బయట పడే వరకు ప్రతీ వ్యక్తి జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యంగా ఉండాలన్నారు.  

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు