మండపేటలో యువతీ అత్యాచారం;పరామర్శించిన మహిళా కమిషచైర్ పర్సన్

మండ పేట సంఘటనలో మానవమృగాల్లా యువతి పై అత్యాచారానికి పాల్పడిన దోషులకు చట్టప్రకారం కఠిన శిక్షలు పడేందుకు, బాధితరాలుకి ప్రభుత్వ పరంగా అన్ని సహాయాలు అందేలా చర్యలు చేపడతామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ తెలిపారు. శుక్రవారం సాయంత్రం కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలోని దిశ వన్ స్టాప్ కేంద్రంలో చికిత్స పొందుతున్న మండ పేట అత్యాచార సంఘటన బాధితురాలిని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ సందర్శించి ఆమెకు అన్ని విధాల అండగా నిలిచి, న్యాయం జరిగేట్లు చూస్తామని ధైర్యం తెలిపారు. ఈ సందర్భంగా తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆమె మాట్లాడుతూ మండ పేటలో జరిగిన దురదృష్టకర సంఘటన సభ్య సమాజం సిగ్గుతో తలచించుకుని, మహిళలపట్ల ఇటువంటి దురాగతాలని ఆపలేకపోతున్నామని ఆవేదన చెందుతోందన్నారు. దిశ వన్ స్టాప్ కేంద్రంలో చికిత్స పొందుతున్న బాధితురాని కలిసి మహిళా కమీషన్ ద్వారా తగిన న్యాయం చేస్తామని తెలిపి , ఆమె శారిరకంగాను, మానసికంగాను సత్వరం కోలుకునేలా సేవలు అందించాలని వైద్యులను కోరామన్నారు. డిగ్రీ పరీక్షలు రాయవలసిన సమయంలో బాలిక ఈ అమానుషానికి గురికావడం హృదయాన్ని కలిచివేస్తోందని, విద్యావంతురాలైన ఆమె దైర్యంగా అతి తొందరలోనే కోలుకోగలదని, ఒకటి రెండు రోజుల్లో డిశ్చార్జి కాగలదని ఆశాభావం వ్యకం చేశారు. సంఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగిందని, సేకరించిన ఆధారాలతో బలమైన చార్జిషీట్ దాఖలు చేసి 15 రోజుల్లో విచారణ పూర్తి చేయడం జరుగుతుందని తెలియజేశారు. మహిళల పట్ల ఆరాచకాల కేసులలో దోషులను ఉపేక్షించకూడదని రాష్ట్ర ముఖ్యమంత్రి కచ్చితమైన ఆదేశాలు ఇచ్చారని, దర్యాప్తులు అధికారులు ఏవిధంగా రాజీపడకుండా ఈ కేసులో దుర్మార్గులకు కఠినమైన శిక్షలు పడేలా చిత్తశుద్ధితో పనిచేయాలని ఆమె కోరారు. మహిళలపై లైంగిక దాడులకు పాల్పడితే తమ జీవితాలను నాశనం చేసుకోవడమైననే భయం దుర్మార్గులలో కలిగించేలా రాష్ట్ర ప్రభుత్వ తెచ్చిన దిశ చట్టం త్వరలోనే కేంద్ర ప్రభుత్వ ఆమోదం పొందనుందని, మహిళల రక్షణ, భద్రత అంశాల్లో మన రాష్ట్రం రాబోయే ఒకటి, రెండు సంవత్సరాల్లో ఆదర్శంగా నిలువనుందని ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ పిడి సుఖజీవన్ బాబు, పోలీస్ అధికారులు, దిశ సెంటర్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు