ఇంటికే మందులు ...

KOVID - 19 నివారణ చర్యలలో భాగంగా ఈరోజు తూర్పు గోదావరి జిల్లా పోలీస్ కార్యాలయం నందు అపోలో మెడ్ ప్లస్ ఫార్మసీ సంస్థలు ఈ లాక్ డౌన్ సమయంలో ఎవరైనా ఇంటి నుండి బయటకు కు వచ్చి మందులు కొనుక్కోవడానికి అవకాశం లేనివారికి వారి ఆర్డర్ ప్రకారం ఎటువంటి చార్జీలు లేకుండా వారి ఇంటికి వారికి కావలసిన మందులు వారికి స్వయంగా ఫార్మసీ సిబ్బందే ఇచ్చే సౌకర్యం ఎస్సి శ్రీ అద్నాన్ నయీమ్ అస్మి గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ ఇలా ఈ ఫార్మసీ సంస్థలు ముందుకు రావడం చాలా అభినందనీయమని ఇంట్లో నుండి బయటకురా లేనటువంటి ఎవరైనా ఉన్నట్లైతే వారికి ఈ సౌకర్యం చాలా ఉపయోగకరంగా ఉంటుందని, దీనిని కావలసినవారు సద్వినియోగం చేసుకోవచ్చని తెలియజేశారు. ఈ సమయంలో పోలీస్ సిబ్బంది ఎవరు వీరిని ఆటంక పరచ వద్దని పోలీసువరందరికీ ఆదేశాలు ఇచ్చారు. ఈ సౌకర్యం కాకినాడ పట్టణ మరియు రూరల్ ప్రాంతాలలో అందుబాటులో ఉంటుందని తెలియజేశారు. అదేవిధంగా లిస్ట్ లో ఉన్న నంబర్లకు నంబర్లకు ఫోన్ చేస్తే బంగా స్వయంగా. ఈ సౌకర్యం ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటుందని తెలియజేశారు. అదేవిధంగా డి ఆర్ డి ఎ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ Y. హరిహర నాథ్ గారు తమ శాఖ తరఫున 3000 మాస్క్ లను మరియు కోరమాండల్ ఫెర్టిలైజర్స్ వారి సౌజన్యం తో 300 మాస్క్ లను పోలీసు సిబ్బందికి మరియు అధికారులకు పంపిణీ చేయు నిమిత్తం ఎస్పి గారికి అందజేసినారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముందుకు వచ్చిన అపోలో మెడ్ ప్లస్ ఫార్మసి సంస్థల వారిని DRDA PD గారికి, కోరమాండల్ ఫెర్టిలైజర్స్ యాజమాన్యానికి SP గారు అభినందనలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఓ ఎస్ డి . శ్రీ ఆరిఫ్ హఫీజ్ గారు, అడిషనల్ ఎస్పి అడ్మిన్ శ్రీ కె. కుమార్ గారు ఎస్ బి . డి ఎస్ పి లు శ్రీ M. అంబికా ప్రసాద్, శ్రీ ఎస్ మురళీ మోహన్, కాకినాడ ఇంచార్జ్ డి.ఎస్.పి శ్రీ వి భీమారావు, ఎస్బి. ఇన్స్పెక్టర్ శ్రీ ఎస్ రాంబాబు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు