కుటుంబ యుటిఎఫ్ కుటుంబ సంక్షేమ పథకం ఉపాధ్యాయులకు వరం
సామర్లకోట: యుటిఎఫ్ కుటుంబ సంక్షేమ పథకం ఉపాధ్యాయిని ఉపాధ్యాయులకు ఒక వరం లాంటిదని ఉభయగోదావరి జిల్లా శాసన మండలి సభ్యులు ఇళ్ల వెంకటేశ్వరరావు అన్నారు బుధవారం సాయంత్రం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో లో ఈనెల 4వ తేదీన మరణించిన హెడ్ మాస్టర్ మణికుమార్ మృతికి సంస్మరణ సభ యుటిఎఫ్ తరపున నిర్వహించారు ఈ సమావేశానికి యుటిఎఫ్ మండల శాఖ అధ్యక్షులు ఐ పి శ్రీనివాసరావు అధ్యక్ష వహించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారు యుటిఎఫ్ కుటుంబ సంక్షేమ పథకాలు ఉన్నవారికి సర్వీసు లో ఉండి మరణించిన వారికి 2 లక్షల 50వేలు ఆర్థిక సాయం ఎమ్మెల్సీ చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ యుటిఎఫ్ జిల్లా వ్యాప్తంగా 13,000 మంది సభ్యులు ఉండగా వారిలో ఎనిమిది వేల మంది కుటుంబ సంక్షేమ పథకాలు సభ్యులుగా ఉన్నారని అన్నారు సర్వీస్ లో ఉండి మృతి చెందిన ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులకు ఈ పథకం ద్వారా ఆర్థిక సాయం అందుతుందని యుటిఎఫ్ సభ్యులుగా ఉన్న వారికి యుటిఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా ముందుందని అన్నారు మణికుమార్ ఉపాధ్యాయ వృత్తి మరొకవైపు గాయకుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలి మంచి పేరు పొందారని అన్నారు. ఆయన మృతి ఉపాధ్యాయ సంఘాలకు ఆయనమృతి తీరని లోటు అన్నారు మండల విద్యాశాఖ అధికారి విజయలక్ష్మి మాట్లాడుతూ సామర్లకోట మండలం లో ఉపాధ్యాయులు మణికుమార్ మంచి గుర్తింపు పొందారని ఆయన ఏ కార్యక్రమంలో పాల్గొన్నా తన గాత్రంతో అందర్నీ అలరించే వారిని పిల్లలను ఆకర్షించే వారని అన్నారు అనంతరం యుటిఎఫ్ కుటుంబ సంక్షేమ పథకం కింద మణికుమార్ కుటుంబానికి రెండు లక్షల 50 వేలు చెక్కును సమావేశంలో అందజేశారు ఈ కార్యక్రమంలో మండల యూటీఎఫ్ కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి గంగరాజు యుటిఎఫ్ జిల్లా కుటుంబ సంక్షేమ శాఖ సంఘం కార్యదర్శులు గోవిందరాజులు జిల్లా గౌరవ అధ్యక్షులు వర్మ యుటిఎఫ్ మండల అధ్యక్షుడు ఐ పి శ్రీనివాసరావు కార్యదర్శి కే ప్రబాకర్ యుటిఎఫ్ మండల గౌరవాధ్యక్షులు ఎస్ వి రామరెడ్డి యూటీఫ్ సీనియర్ నాయకులు బొజ్జ అశోక్ ఎస్ టి యు నాయకులు అర్జున్ కుమార్ యు టి ఎఫ్ కోశాధికారి తాతారావు యుటిఎఫ్ నాయకులు అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి