బాలికపై టీచర్ అత్యాచారం.. తెలంగాణలో మరో ఘోరం..
ఓ ఉపాధ్యాయుడు తన వద్ద చదువుకుంటున్న విద్యార్థినిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ అమానవీయ ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకుంది. నాగర్ కర్నూల్ జిల్లా పెద్దూరుకు చెందిన సామ శరత్ కుమార్ వనపర్తి జిల్లాలోని ఓ గ్రామంలో ఉన్న ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్నాడు. అదే స్కూల్‌లో ఓ విద్యార్థిని 4వ తరగతి చదువుతోంది.. పాఠాలు బాగా చెబుతున్నాడు కదా అని ట్యూషన్ చెప్పాలని కోరింది. ఆమెతో పాటు మరికొంత మంది విద్యార్థులు తోడయ్యారు. అందరూ కలిసి డౌట్లు అడగటం మొదలు పెట్టారు. అన్ని డౌట్లు స్కూల్‌లో చెప్పడం కుదరదు.. ఇంటికి వస్తే చెబుతానని అన్నాడు. చదువు బాగా వస్తుందిగా.. సర్ వాళ్లింటికి వెళ్దామని అనుకున్నారు విద్యార్థులు. తల్లిదండ్రులకు ఇదే విషయాన్ని చెప్పగా వాళ్లూ సరేనన్నారు. ఈ క్రమంలో ఇంటికి వచ్చాక బాలికలతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు టీచర్ ముసుగులో ఉన్న ఆ కామాంధుడు. ఎవరికీ చెప్పొద్దని బెదిరించేవాడు. చివరికి ఓ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ అమానవీయ ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకుంది. నాగర్ కర్నూల్ జిల్లా పెద్దూరుకు చెందిన సామ శరత్ కుమార్ వనపర్తి జిల్లాలోని ఓ గ్రామంలో ఉన్న ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్నాడువిద్యార్థులకు దగ్గరై వాళ్లను ఇంటికి రప్పించుకొని అసభ్యంగా ప్రవర్తించేవాడు. రెండ్రోజుల క్రితం ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడి ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడు. ఆ బాలిక కూడా కుమ్మనకుండా ఉండిపోయింది. తెల్లవారుజామున బాలిక స్నానం చేస్తుండగా రక్తస్రావం కావడంతో తల్లి చూసి స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లింది. వైద్యులు చెప్పిన సమాధానం విని ఆ బాలిక తల్లి ఒక్కసారిగా షాక్‌కు గురైంది. మీ బిడ్డపై ఎవరో అత్యాచారం చేశారు.. అని అనడంతో ఆమె గుండె ఆగినంత పనైంది. వెంటనే ఇంట్లో వాళ్లకు చెప్పి గ్రామస్తులతో కలిసి స్కూల్‌కు వెళ్లి యాజమాన్యాన్ని నిలదీశారు. అక్కడ వాళ్లకు గట్టి షాక్ తగిలింది. మీరు అసలు మీ పిల్లల్ని అతడి ఇంటికి ఎందుకు పంపిస్తున్నారు? అని అనడంతో ఏమీ చేయలేకపోయారు.నిందితుడు వేరే ఊరిలో ఉన్నట్లు తెలుసుకున్న గ్రామస్తులు.. అక్కడికి వెళ్లి తీసుకొచ్చి నిలదీశారు. దీంతో తాగిన మత్తులో తాను ఆ పని చేశానని ఒప్పుకోవడంతో చితకబాదారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. హుటాహుటిన ఘటనాస్థలికి వెళ్లి నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా.. మరికొంత మంది విద్యార్థినులతోనూ అతడు అసభ్యంగా ప్రవర్తించినట్లు తేలింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి