ఎస్సీ ,ఎస్టీ చట్టాలపై అవగాహన కల్పించండి ;రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు డా. కె.నరహరి వరప్రసాద్
తూ. గో ;ఎస్సీ, ఎస్టి ప్రజల పై దాడులు, దురాగతాలను అరికట్టే లక్ష్యంగా ఈ వర్గాలు నివసించే ఆవాసాల్లో ప్రతి నెల 30వ తేదీన పౌరహ
క్కుల రోజు పాటించి వారి రక్షణ, భద్రతల కొరకు ఏర్పాటైన చట్టాల పై విస్తృత అవగాహన కల్పించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు డా. కె.నరహరి వరప్రసాద్ పోలీస్, రెవెన్యూ అధికారులను కోరారు. ఆదివారం మద్యాహ్నం రాష్ట్ర ఎస్.సి., ఎస్టీ కమీషన్ సభ్యులు డా. కె.నరహరి వరప్రసాద్ స్థానిక ఆర్ అండ్ బి అతిధి గృహంలో ఎస్.సి, ఎస్ వర్గాల ప్రజల నుండి ఫిర్యాదులు, విజ్ఞాపనలు స్వీకరించారు. కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ఎస్.సి, ఎస్ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, విజిలెన్స్ కమిటీ సభ్యులు పాల్గొని వ్యక్తిగత, సామాజిక పరంగా ఎదుర్కోంటున్న సమస్యలను కమీషన్ సభ్యునికి తెలియజేసారు. అనంతరం ఆయన జిల్లా అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి జిల్లాలో ఎస్సీ, ఎస్టి ప్రజల రక్షణ, అరాచాకాలు, అకృత్యాలకు లోనైన వారికి అందించిన ఆర్థిక, న్యాయ పరిహారాలు, పెండింగ్ కేసులు తదితర అంశాల పై సమీక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 2017 నుండి 2020 ల మద్య జిల్లాలో అట్రాసిటీ కేసుల సంఖ్య తగ్గడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అట్రాసిటీ కేసులలో బాధితులకు సత్వర సహాయం అందించాలని, దురాగతాలకు పాల్పడిన వారెవరూ శిక్షపడకుండా తప్పించుకోకుండా పటిష్టంగా కేసులు నమోదు చేయాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ ప్రజల రక్షణకు ఏర్పాటైన చట్టాల పై అన్ని వర్గాల ప్రజల్లో అవగాహన కల్పించాలని, తద్వారా ఎస్సీ, ఎస్టి ప్రజల్లో స్వీయ రక్షణకు, ఇతర వర్గాల ప్రజల్లో ఎస్సీ, ఎస్ ప్రజల హక్కుల పట్ల గౌరవం పెంపొందించేదుకు కృషి చేయాలన్నారు. ఇందుకు ప్రతి నెల 30వ తేదీన ఎస్సీ, ఎస్టీ ఆవాసాల్లో సివిల్ రైట్స్ డే కార్యక్రమాలను పోలీస్, రెవెన్యూ, సంక్షేమ సంఘాలు సమన్వయంతో నిర్వహించాలన్నారు. ఎస్సీ, ఎస్లి ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రతి నెలా ఆఖరు వారంలో ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ నిర్వహించాలని అధికారులకు సూచించారు. జిల్లా స్థాయి ఎస్సీ, ఎస్ విజిలెన్స్ కమిటీ సమావేశాలు ప్రతి మూడు నెలల కొకసారి క్రమం తప్పకుండా నిర్వహించాలని, అలాగై డివిజన్, మండల స్థాయిలో కూడా విజిలెన్స్ కమిటీలు ఏర్పాటు చేయాలని కోరారు. జన వ్యవహారంలో హరిజన, గిరిజన, దళిత వంటి పదాల వినియోగాన్ని పూర్తిగా విడనాడాలని ఆయన కోరారు. ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులు తమ సమస్యలను కమీషన్ సభ్యునికి అందజేశారు. జిల్లాలో తుని, జగ్గంపేట, కాకినాడలో వున్న సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాలు శిథిలావస్థకు చేరాయని వాటి స్థానంలో నూతన భవనాలు నిర్మాణం చేపట్టాలని ఎస్.సి, ఎస్.టి మోనిటరింగ్ మరియు విజిలెన్స్ కమిటీ సభ్యులు కమ్ము చిన్న అర్జీని అందివ్వగా ఈ సమస్యను పరిష్కరించవలసిందిగా డిఆర్ ఓ ఆదేశించారు. ఎస్.సి ఉపకులానికి చెందిన మోనికులస్తులమైన తమకు గత కొంతకాలంగా ప్రభుత్వం అందించే వివిధ రకాల సబ్సిడీ లోన్లు తమకు అందడం లేదని, మోచికుల సంక్షేమానికి చెందిన బి.బలభద్రరావు, కె.పద్మనాభం, తదితరులు అర్జీని అందివ్వగా ఈ సమస్యను పరిష్కరించవలసిందిగా ఎస్.సి కార్పోరేషన్ ఇడిని ఆదేశించారు. షెడ్యూల్ తెగలకు చెందిన ఎరుకుల కులస్తుల జీవనాధారమైన పందుల పెంపకంనకు ప్రత్యమ్నాయ ప్రాంతాలు చూపకుండా నిర్మూలించే విధంగా అధికారులు తమపై ఒత్తిడి తీసుకువస్తున్నారని మరియు ఎరుక కులస్తులకు రాజకీయంగా ప్రాధాన్యం కల్పించడం లేదని సగడాల ధర్మరాజు, గరికిపాటి గోవిందు, గరికిపాటి శ్రీనివాసులు, తదితరులు అర్జీని అందివ్వగా ఈ సమస్యను పరిష్కించవలసిందిగా డిఆర్‌ఓ ఆదేశించారు. 12వసంత్సరాలు వృత్తి అనుభవం పొందిన సెకండ్రీ గ్రేడ్ ఉపాధ్యాయులందరికి పాఠశాల సహాయకులుగా హోదా కల్పించడంతో పాటు 2003 డిఎస్ ఉపాధ్యాయులకు పాత పింఛను వర్తింపజేయాలని, సెకండ్రీ గ్రేడ్ టీచర్ల ఎదుర్కోంటున్న ఈ సమస్యలను ఎన్.వరప్రసాద్ దృష్టికి తీసుకువెళ్లగా పరిష్కారం నిమిత్తం ఉన్నత విద్యాశాఖాధికారులతో చర్చించి తమ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఏకలవ్య ఎస్.టి యూనైటెడ్ ఎంప్లాయిడ్స్ అసోసేషన్ సభ్యులు తమకు జిల్లాలో సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ, గిరిజన భవన్ నిర్మించాలని మరియు రోష్టర్ ప్రకారం అన్ని శాఖలలో ప్రమోషన్, బ్యాక్ లాంగ్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని ఎ.శ్రీను, తదితరులు అర్జీని అందివ్వగా ఈ సమస్యను పరిష్కరించవలసిందిగా డిడి ట్రైబుల్ వెల్ఫేర్ అధికారిని ఆదేశించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి