మోడీ సోషల్ ట్విస్ట్ ...
దీంతో ఎట్టకేలకు మోడీ బయటపడ్డాడు. మంగళవారం మరో ట్వీట్ లో సోషల్ మీడియా ఎగ్జిట్ పై వివరణ ఇచ్చాడు.
ప్రధాని మోడీ నిస్సహాయత నిర్వేదంతో తాను సోషల్ మీడియాను వదిలేస్తున్నారని ఆదివారం చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. సీఏఏ ఎన్నాఆర్సీ ఆందోళన నేపథ్యంలోనే సోషల్ మీడియా ద్వారా రగిలిన ఈ వివాదాలకు మనస్థాపం చెంది మోడీ ఇలా ఫేస్ బుక్ ట్విట్టర్ ఇన్ స్టాగ్రామ్ యూట్యూబ్ వదిలేస్తున్నారని అంతా అనుకున్నారు.రాహుల్ గాంధీ కూడా మోడీ సోషల్ మీడియా ఎగ్జిట్ పై కౌంటర్ ఇచ్చారు. ‘వీడాల్సింది సోషల్ మీడియా కాదు.. విద్వేశం అని’ కౌంటర్ ఇచ్చారు. చాలా మంది ప్రతిపక్షాలు కూడా దీనిపై విమర్శలు చేశాయి.తాను ఈ ఒక్క ఆదివారం మాత్రమే సోషల్ మీడియాకు దూరంగా ఉంటానని ప్రకటించారు. తాను ఎందుకు సోషల్ మీడియాను వదిలేస్తానన్నది చెప్పుకొచ్చాడు. ఓ మంచి కార్యక్రమం కోసం ఆదివారం సోషల్ మీడియాను వాడనని.. వచ్చే ఆదివారం మహిళా దినోత్సవం సందర్భంగా లక్షలాది మంది మహిళలకు నా అకౌంట్లను అప్పగిస్తున్నానని తెలిపారు. మహిళలంతా షి ఇన్ స్పైర్ అజ్ యాష్ ట్యాగ్ తో తనను అకౌంట్ కు ట్యాగ్ చేయండని పిలుపునిచ్చారుఇలా మహిళా దినోత్సవం సందర్భంగా.. మహిళల కోసం ఆదివారాలు తన సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నానే విషయం ప్రకటించారు. ప్రపంచంలోనే ట్విట్టర్ లో అత్యధికంగా ఫాలో అయ్యే వారిలో 3వ స్థానంలో మోడీ ఉన్నారు. ఆయన వైదొలుగుతానని ప్రకటించడం సంచలనమైంది. అయితే మహిళల కోసం ఆదివారం దూరంగా ఉంటానని తెలుపడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి