విపత్తులు విపత్తులు లాంటి సమయాల్లో సమాచార శాఖ బాద్యాతాయుతమైన పాత్ర పోషించవలసివుంటుంది
తూ . గో. ;విపత్తులు విపత్తులు లాంటి సమయాల్లో సమాచార శాఖ బాద్యాతాయుతమైన పాత్ర పోషించవలసివుంటుందనీ రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ కమీషనర్ టి.విజయకుమార్ రెడ్డి తెలిపారు. మంగళవారం సమాచార శాఖ కమీషనర్ అధికారులతో కలిసి విజయవాడ నుండి క్షేత్ర స్థాయిలో సమాచార శాఖ జాయింట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇన్ పర్ మెషన్ ఇంజనీర్లతో కరోనా వైరస్ పై వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమీషనర్ విజయకుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెంది, దేశంలోని అన్ని రాష్ట్రంలో విజృంభిస్తుందన్నారు. ఈ వైరస్ కు మందులేదని, నివారణ ఒక్కటే మార్గమని తెలుపుతూ వ్యక్తులకు ఈ వైరస్ సోకకుండా వ్యక్తిగత జాగ్రత్తలు పాటించే విధంగా ప్రజల్లో అవగాహన పెంచే విధంగా సమాచార శాఖ పాత్ర కీలకమైనదన్నారు. ప్రచారసాధనాలతో పాటు, సామాజిక మాద్యామాల్లో అపోహాలు సృష్టించే విధంగా తప్పుడు సమాచారం వస్తుందనీ దీని పట్ల అప్రమత్తంగా వుండే విధంగా సమాచార శాఖ క్షేత్రస్థాయి అధికారులు పనిచేయాలన్నారు. జిల్లా కలక్టర్లకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ, తగిన విధంగా కలక్టర్ల ద్వారా ప్రభుత్వం పరంగా చేపడుతున్న చర్యలను మీడియాకు చేరే విధంగా తరచుగా ప్రెస్ కాన్ఫరెన్లు ఏర్పాటు చేస్తుండాలన్నారు. కరోనా వ్యాధి పై రోజు వారి పనితీరును మీడియాకు చేరవేస్తూ జిల్లా యంత్రాంగంతో సమన్వయంతో పనిచేయాలని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కమీషనర్ విజయకుమార్ రెడ్డి పలు సూచనలు చేసారు. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా సమాచార పౌరసంబంధాల శాఖ ఉపసంచాలకులు జి.మనోరంజన్ జిల్లాలో చేస్తున్న ఏర్పాట్లను కమీషనర్ కు వివరించారు. కాకినాడ కలక్ట రేట్ లోని మీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు లక్ష్మీనారాయణ రెడ్డి, డివిజనల్ పౌరసంబందాధికారులు పి.రవి, కె.సరస్వతి, ఎపిఆర్ఎఎమ్.డి విలాయత్ ఆలీ పాల్గొన్నారు. ( సమాచార శాఖచే జారీ)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి