వేసవి తాగునీటి ఎద్దడి నివారణా చర్యలు చేపట్టండి

జిల్లాలో రానున్న వేసవికాలాన్ని దృష్టిలో వుంచుకుని మంచి నీటి కొరత లేకుండా చేయాలని జిల్లా కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు. మంగళవారం నాడు కలక్టర్ కార్యాలయంలో కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి అధ్యక్షతను గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ద్యాశాఖ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలక్టర్ మాట్లాడుతూ రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో వుంచుకుని ప్రతి గ్రామంలో నీటి ఎద్దడి లేకుండా చేయాలని తెలిపారు. మార్చి చివరి నాటికి ఎస్ఆర్ జిఎస్ పధకం ద్వారా 50 కోట్లు నిధులు వృధాకాకుండా మంజూరైన ప్రతి పని పూర్తి చేయాలన్నారు. ఇంత వరకు ఇసుక కొరత ఉండడం వలన సిసిడైయిన్ల నిర్మాణ పనులు నెమ్మదిగా జరిగాయని జిల్లాలో ప్రస్తుతం ఇసుక లభ్యత తగినంత వున్నదని సిసిడైయిన్లు నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కలక్టర్ తెలిపారు. మరుగుదొడ్ల నిర్మాణ పనులు వేగవతం చేసి, ఎల్ ఓబి మరియు ఎ ఓఎల్ బిలలో మిగిలివున్న 35 వేలు మరుగు దొడ్లును వెంటనే పూర్తి చేసి లబ్ధిదారులందరికి వారి ఖాతాలోకి సొమ్ము జమ అయ్యే విధంగా చేయాలన్నారు. గ్రామీణ నీటి విభాగంలో పనిచేస్తున్న ఏఇలు, డిఇలు తప్పనిసరిగా ప్రతి నివాసన్ని క్షేత్ర స్థాయి పరిశీలన చేయాలన్నారు. వచ్చే సమావేశం నాటికి నిర్దేశించిన లక్ష్యాల్లో పురోగతి కనిపించాలని కలక్టర్ అధికారులకు సూచించారు. వేసవి దృష్ట్యా మార్చి చివరి నాటికి గ్రామాల్లో వున్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను నూరు శాతం నింపివుంచుకోవాలని కలక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో ఎస్.ఇ ఆర్ డబ్ల్యూఎస్ టి.రాయిత్రిదేవి, రాజమహేంద్రవరం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎమ్.శ్రీనివాస్, జిల్లాలో వున్న డిఇలు, జెఇలు, తదితరులు పాల్గొన్నారు. ( సమాచార శాఖచే జారీ)


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు