మొన్న స్పానిష్ ఫ్లూ ... నేడు కరోనా వైరస్ ని జయించిన శతాధిక వృద్ధుడు

1919లో స్పానిష్ ఫ్లూ సమయంలో పుట్టి.. కరోనాను జయించిన ఇటలీ శతాధిక


101 వృద్ధుడు ప్రస్తుతం కోవిడ్‌ నుంచి బయటపడ్డాడు.కరోనా బారిన పడి వృద్ధులు ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్న వేళ.. ఇటలీలో 101 ఏళ్ల వృద్ధుడు కోవిడ్‌ నుంచి బయటపడ్డాడు. 1919లో స్పానిష్ ఫ్లూ సమయంలో ఆయన జన్మించాడు.


 

 





 





కరోనా వైరస్   ప్రభావంతో ఇటలీ విలవిల్లాడుతోంది. ఏ దేశం లేనంతగా కోవిడ్ బారిన పడి 9 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకూ ఆ దేశంలో 86 వేల మందికి కరోనా వైరస్ సోకింది. టీనేజర్లు, యువత కూడా కోవిడ్ బారిన పడినప్పటికీ.. ఇటలీలోవయసు మీద వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో ప్రాణ నష్టం ఎక్కువగా ఉంటోంది. వేలాది మంది మరణిస్తుండటంతో.. వణికిపోతున్న ఇటలీ వాసుల్లో ఆశలు నింపే వార్త ఒకటి వెలుగు చూసింది. ఓ శతాధిక వృద్ధుడు కరోనా వైరస్‌ను జయించాడు.మిస్టర్ పి అని పిలుస్తోన్న 101 ఏళ్ల వృద్ధుడి స్వస్థలం ఇటలీలోని తీర ప్రాంత నగరమైన రిమిని. 1918లో ప్రపంచాన్ని గడగడలాడించి స్పానిష్ ఫ్లూ సమయంలో పుట్టిన ఆయన.. ఇప్పటి కోవిడ్-19ను కూడా జయించారు. ఆయన రెండు ప్రపంచ యుద్ధాలను కూడా చూడటం గమనార్హం.రిమిని వైస్ మేయర్ గ్లోరియా రిసి వెల్లడించిన వివరాల ప్రకారం మిస్టర్ పి 1919లో జన్మించారు. అప్పటికే స్పానిష్ ఫ్లూ విజృంభణ తీవ్రంగా ఉంది. 1918 జనవరిలో మొదలైన స్పానిష్ ఫ్లూ 1920 డిసెంబర్ వరకు కొనసాగింది. ఈ ఫ్లూ బారిన పడి ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.మిస్టర్ పి’ కోవిడ్ 19 బారిన పడటంతో వారం క్రితం ఓస్పెడెలే ఇన్‌ఫెర్మీ డీ రిమినీ హాస్పిటల్‌లో చేరారు. కరోనా బారిన పడి కోలుకున్న అతి పెద్ద వయస్కుల్లో మిస్టర్ పి ఒకరు కావడం గమనార్హం. కరోనా వైరస్ ప్రభావంతో వేలాది మంది చనిపోతుండటంతో ప్రజల్లో ఓ రకమైన నిర్వేదం అలుముకుంది. ఇలాంటి తరుణంలో 100 ఏళ్లు పైబడిన మిస్టర్ పి కరోనాను జయిండంతో వృద్ధులు కూడా కరోనాను జయించొచ్చనే నమ్మకం అక్కడి ప్రజల్లో ఏర్పడింది.



కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు