కాకినాడలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్
క్షేత్రస్థాయిలో నిత్యవసర వస్తువుల రవాణ, మరియు పంపిణీ విషయాల పై సమస్యలుంటే కాకినాడలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ కి తెలియచేయాలని జిల్లా కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి ఆదేశించారు. గురువారం కలక్టర్ కార్యాలయం నుండి మండల స్థాయి అధికారులతో కలెక్టర్ మరియు జిల్లా ఎస్.పి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నిత్సవసర వస్తువుల రవాణాకు ఎటువంటి అంతరాయం లేకుండా అధికారులు చూడాలని అన్నారు. అయితే ఎట్టి పరిస్థితులలోను ప్రయాణికులను అనుమతించరాదని ఆయన స్పష్టం చేసారు. ఈ సందర్భంగా జిల్లా కలక్టర్ మాట్లాడుతూ డిఆర్ డీఏ ద్వారా 10వేల మాస్కులు కాకినాడ ఎస్.పి కార్యాలయంనకు అదే విధంగా రాజమహేంద్రవరం అర్బన్ ఎస్.పి కార్యాలయం నకు 5వేల మాస్కులు పోలీస్ కొరకు సరఫరా చేయడం జరుగుతుందని అన్నారు. అయితే ఉపయోగించిన మాస్కులను జాగ్రత్తగా డిస్పోజ్ చేయవల్సి ందిగా ఆఆయ పోలీస్ అధికారులను కోరారు. జిల్లాలో పోలీస్ యంత్రాంగం కరోన వ్యాది నియంత్రణలో బాగా పని చేస్తున్నందుకు ఆయన అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా యస్.పి. అద్నాన్ నయీమ్ అస్మి మాట్లాడుతూ సరుకుల రవాణా వాహనాలకు ఎటువంటి అవాంతరాలు రాకుండా చూడాలన్నారు. అదే విధంగా పత్రికా విలేఖర్లకు, ఫొటోగ్రాఫర్లకు, ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్లు, వీడియోగ్రాఫర్లకు అనుమతించాలని కోరారు. అయితే వారు అక్రిడిటేషన్ కార్డు గానీ, లేదా వారి మేనేజ్ మెంట్ జారీ చేసిన ఐడి కార్డు గానీ చూపిస్తే వారిని ఆటంకపర్చవద్దని ఎస్.పి. క్షేత్ర స్థాయి పోలీస్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఎటువంటి మద్యం అమ్మకాలు గానీ, నాటు సారాయిగానీ వెలుగులోకి వస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా యస్.పి. అద్నాన్ నయీమ్ అస్మి మాట్లాడుతూ నాటు సారా మరియు కోడి పందేలు నిర్వహించే వారి పై ఉక్కుపాదం మోపాలని ఆయన అన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో జిల్లాలో నాటు సారా తయారీ, అమ్మకాలు జరుగరాదని, క్షేత్ర స్థాయి పోలీస్ అధికారులు నిశితంగా గమనిస్తూ కేసులు పెట్టాలని యస్.పి. స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలక్టర్ మాట్లాడుతూ సరుకుల రవాణాకు సంబంధించి జిల్లా యంత్రాంగం కొన్ని మార్గ నిర్దేశాలు చేసిందని, అయితే స్థానిక పరిస్ధులను బట్టి అధికారులు నిర్ణయం తీసుకోవాలని ఆయన అన్నారు. ఏ విధమైన సరుకు నిత్యావసర వస్తువుల జాబితాలో ఉంటుందో సదరు వ్యక్తి చెప్పినదాని ప్రకారం సులువుగా తెల్సుకోవచ్చన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల సిబ్బందికి ఆయా ఆసుపత్రులు జారీ చేసిన ఐడి కార్డులను పరిగణలోకి తీసుకుని వారు విధులకు హాజరయ్యేందుకు అనుమతించాలన్నారు. పారిశుధ్యపనివారు మరియు హమాలీలను కూడా వారి పనులను నిర్వర్తించడానికి అనుమతించాలన్నారు. జాయింట్ కలక్టర్ లక్ష్మిశ మాట్లాడుతూ 25 రకాల వస్తువులను నిత్యావసర వస్తువుల క్రింద గుర్తించడం జరిగిందన్నారు. నిత్యావసర వస్తువులు రవాణా, దిగుమతి , పంపిణీ కార్యక్రమంలో ఎటువంటి అంతరాయం కలుగ కుండా చూడాలని ఆయన అధికారులను కోరారు. సప్లయి చైన్ సరిగా జరగాలంటే అధికారులు స్థానికంగా హేతుబద్ధకంగా అలోచించి నిర్ణయంతీసుకోవాలని ఆయన అన్నారు. నిత్యావసర వస్తువులు క్రింద సెలైన్లు, ఇతర మందులు, పాలు, గుడ్లు, కూరగాయలు, పచారీ వస్తువులు, కోడి మాంసం, చేపలు, మాంసం, పశువుల దానా, త్రాగునీరుకు సంబంధించి ట్యాంకులు, మందులు దానికి సంబంధించిన రా మెటీరియల్, మాస్కులు దానికి సంబంధించిన పరికరాలు, పెట్రోలు, ఎల్.పిణి. గ్యాస్, సి.ఎన్.జి గ్యాస్, హెల్త్ సర్వీసులు తదితరులు ఉంటాయని అన్నారు. అయితే ధాన్యం కోతలు మరియు రవాణా జరుగుచున్నందున వాటిపై కూడా స్థానికంగా నిర్ణయం తీసుకోవాలన్నారు. ఏమైన సందేహాలు ఉంటే వెంటనే కంట్రోల్ రూమ్ కి తెలియజేయాలని జాయింట్ కలక్టర్ కోరారు. జాయింట్ కలక్టర్ - 2 జి.రాజకుమారి మాట్లాడుతూ ఇప్పటి వరకు జిల్లాలో విదేశాల నుండి వచ్చిన వారిని గుర్తించడం జరిగిందని , వారిని నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ప్రతి ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి సంబంధిత గ్రామ సెక్రటరియేట్ నుండి ఇద్దరు డిజిటల్ ఆపరేటర్లను తీసుకుని ఎప్పటికప్పుడు డేటాను పర్యవేక్షించాలన్నారు. క్వరంటైన్ లో నిబంధనల ప్రకారం అన్ని సదుపాయాలు ఉండేలా చూడాలని అన్నారు. త్వరలోనే శానిటైజర్లను పంపించడం జరుగుతుందని ఆమె స్పష్టం చేశారు. రంపచోడవరం ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి నిషాంత్ కుమార్ రంపచోడవరం నుండి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొంటూ త్రాగునీటి గురించి సీజనల్ వ్యాధుల గురించి జిల్లా కలక్టర్ దృష్టికి తెచ్చారు. దీని పై జిల్లా కలక్టర్ డి.మురళీదర్ రెడ్డి మాట్లాడుతూ కరోన నియంత్రణతో పాటు అధికారులు ఇతర వ్యాదులపై దృష్టి కేరించి వాటిని కూడా నియంత్రించాలన్నారు. గ్రామ స్థాయిలో గ్రామ సెక్రటరీలు పారిశుధ్యానికి ప్రాముఖ్యతనివ్వాలని కలక్టర్ ఆదేశించారు. జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్తిబాబు మాట్లాడుతూ రెవెన్యూ డివిజనల్ స్థాయిలో కూడా రెవెన్యూ డివిజనల్ అధికారులు కంట్రోల్ రూమ్ లు తెరవాలన్నారు. ప్రతి రోజు డివిజన్ లో ఉన్న పరిస్థితులను కాకినాడకలోని కంట్రోల్ రూమ్ కు తెలియజేయాలన్నారు. ఈ సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి