ప్రభుత్వ బహిరంగ ప్రదేశాల్లో రైతు బజార్లు

కాకినాడ, .2020 కోవిడ్-19 లో భాగంగా రైతు బజారులో విక్రయించే కూరగాయలను సమీపంలోని ప్రభుత్వ బహిరంగ ప్రదేశాల్లో కొనుగోలు దారులకు అనుకూలంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి తెలిపారు మంగళవారం కలక్టర్, జాయింట్ కలక్టర్ జి.లక్ష్మీశతో కలిసి గాంధీనగర్ రైతు బజారును తనిఖీ చేసారు. ఈ సందర్బంగా కలక్టర్ మాట్లాడుతూ కోవిడ్ -19 కారణంగా రైతు బజారులలో రద్దీ ఎక్కువగా ఉండడం గమనించడం జరిగిందన్నారు. కరోనా వైరస్ దృష్ట్యా సమూహలు లేకుండా రైతు బజారులో విక్రయించే కూరగాయలను వివిధ ప్రాంతాల్లో విక్రయించే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. వినియోగదారులు సమూహంగా ఉండకూడదని సామాజిక దూరం ఒక మీటరు పాటించి క్రయ విక్రయాలు చేసుకోవాలని సూచించారు. నిత్యవసర వస్తువులు ఉదయం 6గంటల నుండి ఉదయం 10గంటల వరకు అందుబాటులో ఉండే విధంగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని ఎవరైనా రోడ్ల పైన వస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలక్టర్ తెలిపారు.


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు