
అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి ట్విటర్ వేదికగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సొంత రాష్ట్రంలో దిక్కులేని పార్టీకి జాతీయ అధ్యక్షుడంట! స్థానికంగా జరిగే చిన్న చిన్న గొడవలను ప్రస్తావిస్తూ ఏదో అరాచకం జరిగిపోతోందని ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేసుకుంటున్నాడు. గెలిచే పరిస్థితి లేకపోవడంతో దివాళా కోరు ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఈ మనిషి ఎప్పటికీ మారడు!ఉగాది రోజున పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 5 నెలల క్రితమే ప్రకటించారు. పట్టా డాక్యుమెంట్లు సిద్ధం చేయడం కూడా పూర్తయింది. పండుగ రోజున పేదలు సంతోషంగా ఉండటం ఇష్టం లేని బాబు పంపిణీ నిలిపేయాలని కోర్టుకు వెళ్లాడు. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి అడ్డుకున్నాడు.టీడీపీకి అభ్యర్థులు దొరకకపోవడంతో 5 నుంచి 10 లక్షలు ముట్టచెప్పి నామినేషన్లు వేయించారు. గెలిచే సీన్ లేక వాళ్లెక్కడ ఉపసంహరించుకుంటారో అని క్యాంపులకు తరలిస్తున్నారట. గెలిచిన వాళ్లను రహస్య స్థావరాలకు తీసుకెళ్లడం గురించి విన్నాం. నామినేషన్ వేసిన వారిని దాచిపెట్టడమేమిటి బాబూ? అని మండిపడ్డారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి