త్రివిక్రమ్'మంత్రిగారి వియ్యంకుడు'...?


 






  • కథపై కసరత్తు చేస్తున్న త్రివిక్రమ్ 

  • ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ 

  • కథానాయికగా పూజా హెగ్డే



                                                                                                            త్రివిక్రమ్ శ్రీనివాస్ తన తదుపరి సినిమాకి సంబంధించిన పనులతో బిజీగా వున్నాడు. ఆయన తదుపరి సినిమా ఎన్టీఆర్ హీరోగా ఆగస్టు నుంచి సెట్స్ పైకి వెళుతుంది. అంటే .. ఎన్టీఆర్ 'ఆర్ ఆర్ ఆర్' షూటింగును ముగించుకుని రాగానే, త్రివిక్రమ్ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందన్న మాట.'అయినను పోయిరావలె హస్తినకు' అనే టైటిల్ ను త్రివిక్రమ్ రిజిస్టర్ చేయించిన సంగతి తెలిసిందే.గతంలో చిరంజీవి - అల్లు రామలింగయ్య కాంబినేషన్లో వచ్చిన 'మంత్రిగారి వియ్యంకుడు' సినిమా తరహాలో ఈ కథ నడుస్తుందని అంటున్నారు. రాజకీయ నాయకుడైన తన మావగారిని కథానాయకుడు ఆటపట్టించడం .. ఆటకట్టించడం తరహాలో ఈ సినిమా సాగుతుందని చెబుతున్నారు. ఆ తరహా కథకి త్రివిక్రమ్ మార్క్ కామెడీ .. ఎంటర్టైన్మెంట్ యాడ్ అవుతాయి. ముఖ్యంగా ఈ తరహా అల్లుడు పాత్రలో ఎన్టీఆర్ రెచ్చిపోతాడు. అందువలన ఈ కాన్సెప్ట్ ఆయనకి తప్పకుండా వర్కౌట్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలకు అవకాశం ఉండగా, ఒక కథానాయికగా పూజా హెగ్డే పేరు వినిపిస్తోంది.

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు