ఇది ప్రజా విజయం

కాకినాడ పట్టణంలో జనతా కర్ఫ్యూ విజయవంతం అయ్యిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.కరీనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపు మేరకు ఆదివారం పట్టణంలో నిర్వహించిన జనతా కర్ఫ్యూ విజయవంతం అయిన సందర్భంగా సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సతీమణితో కలిసి తన నివాసంలో పాత్రికేయులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపు మేరకు,రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మద్దతుతో ఆదివారం నగరంలో నిర్వహించిన జనతా కర్ఫ్యూ విజయవంతం అయిందని తెలిపారు.దేశానికి ఏ సమస్య వచ్చినా మేమంతా కలిసి ఉన్నామని తెలుపుతూ కులాలు,మతాలు, పార్టీలకతీతంగా ఈ కర్ఫ్యూను ప్రజలందరూ విజయవంతం చేసారని తెలిపారు. ప్రజలందరూ ముఖ్యమంత్రిపై నమ్మకం వుంచడం వలననే కాకినాడ పట్టణంలో ఈ కర్ప్యూ పెద్ద ఎత్తున విజయవంతం అయ్యిందని అన్నారు. అదేవిధంగా పట్టణంలోని ప్రజలందరూ కరీనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం సూచించిన జాగ్రత్తలు పాటించి ఆరోగ్యంగా జీవించాలని ఎమ్మెల్యే కోరారు.ఈ సమావేశానికి ముందు కరీనా వైరస్ కట్టడి కోసం పనిచేస్తున్న డాక్టర్లు మరియు అధికారులకు ధన్యవాదాలు తెలుపుతూ చప్పట్లు కొట్టారు. (సమాచార శాఖచే జారీ)


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు