మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలుచేయాలి ;మంత్రి నాని
కరోనా వైరస్ నిరోధానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) జిల్లా అధికారులను కోరారు. సోమవారం మద్యాహ్నం కలెక్టరేట్ వివేకానంద సమావేశహాలులో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్, వ్యవసాయ, సహాకార, మార్కెటింగ్ శాఖ మంత్రి కురసాల కన్నబాబు జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి కరోనా వైరసను కట్టడి చేసేందుకు చేపట్టిన, చేపట్టవలసిన చర్యలను సమీక్షించారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి కాళీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ మిగిలిన పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తక్కవగా ఉందని, ఇందుకు క్రింది స్థాయి నుండి వైద్య,ఆరోగ్ సిబ్బంది, ఇతర శాఖల సమన్వయంతో అంకిత భావంతో చేస్తున్న కృషే దోహదం చేసిందన్నారు. ప్రభుత్వ పరంగా చేపడుతున్న వైరస్ నియంత్రణ కార్యక్రమాలకు ప్రజలు కూడా స్వచ్చందంగా సహకరిస్తున్నారని, ఆదివారం విజయవంతంగా జనతా కర్ఫ్యూను పాటించడం ముదావహమన్నారు. రాష్ట్రంలో ఆరు కరోనా వైరస్ పాజిటీవ్ కేసులు నమోదై, అందులో ఒక కేసు నుండి రెండవ దశ సంక్రమణ గమనించిన దృష్ట్యా వైరస్ నిరోధానికి మరింత అప్రమత్త పాటించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపద్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అత్యవసర సమావేశం నిర్వహించి రాష్ట్రంలో ఈ నెల 31 వరకూ లాక్ డౌన్ అమలు చేయాలని నిర్ణయం గైకొన్నారని, పరిస్థితలను ఎప్పటి కప్పుడు అంచనా వేస్తూ, ప్రజా సహకారంతో వైరస్ కట్టడికి మరింత ముమ్మర చర్యలు చేపట్టాలని ఆధికారులను కోరారు. జిల్లాలో విదేశాల నుండి వచ్చిన 1675 మందిని నూరు శాతం గుర్తించి గృహ, ఆసుపత్రి ఐసోలేషన్ ఉంచి వైద్య పర్యవేక్షణ చేపట్టడం పట్ల ఉపముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు.
జిల్లాలోని ప్రతి నియోజక వర్గంలో 100 పడకల క్వారం టైన్ ఐసోలేషన్ సదుపాయం సిబ్దం చేయాలని, జిల్లా ఆసుపత్రిలో కనీసం 200 పడకలు కరోనా కేసుల చికిత్స కొరకు కేటాయించాలని సూచించారు. వెంటి లేటర్లు, పిపిఈ కిట్లు, మాస్క్ లను అవసరం మేరకు ఇండెంట్ చేస్తే సరఫరా చేస్తామన్నారు. కరోనా అనుమానిత కేసులను తరలించే వాహన సిబ్బంది, వైద్యులకు పిపిఈ కిట్లు, ఎన్ 95 మాస్కులు సరఫరా చేయాలని ఆదేశించారు. లాక్ డౌన్ కాలంలో ప్రజలు సామాజిక దూరం సక్రమంగా పాటించేలా కోరాలని, భయపడాల్సిన అవసరం లేకున్నా నిర్లక్ష్యం వహిస్తే విపత్తు పొంచి ఉందనే జాగురూకత ప్రతి ఒక్కరిలో కలిగించాలని కోరారు. ప్రజలకు నిత్యావసర సరుకులు, మందుల కొరత లేకుండా చూడాలని, వాటి ధరలను నియంత్రిస్తూ బ్లాక్ మార్కెటింగ్ కు పాల్పడే వారి పై కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పబ్లిక్, ప్రయివేట్ ట్రాన్స్పర్ట్ లను నిలిపి వేయాలని, సినిమాహాళ్లు, అత్యవసరం కాని వ్యాపారాలను మూసివేయించాలని సూచించారు. వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ ప్రజలకు కూరగాయలు, ఆకుకూరలు సూచించారు.వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ ప్రజలకు కూరగాయలు, ఆకుకూరలు నిత్యావసరం అయినందున రైతు బజార్లను నిర్వహించడం తప్పని సరని, రైతు బజార్లలో సామాజిక దూరం అమలైయ్యేట్లు, కొన్ని షాపులను సమీపంలోని గ్రౌండ్స్ లోకి తరలించాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. ఉగాది పండుగ పురస్కరించి నిర్వహించే జాతర్లను నిలిపివేసి, కేవలం సాంప్రదాయ పూజలు తప్ప మరే కార్యక్రమాలు లేకుండా పర్యవేక్షించాలని ఆయన సూచించారు. సమావేశంలో జిల్లాలో కరోనా వైరస్ అనుమానిత కేసు గుర్తించి జనవరి నుండి ఇప్పటి వరకూ చేపట్టిన వైరస్ నియంత్రణ చర్యలను వివరించి, లాక్ డౌన్ కారణంగా ప్రజా జీవనానికి ఇబ్బంది లేకుండా వైరస్ కట్టడికి చేపడుతున్న కార్యచరణ వివరించారు. జిల్లాలో గుర్తించిన కరోనా వైరస్ పాజిటీవ్ కేసకు క్వారం టైన్ లో చికిత్స, ఈ కేసు ప్రభావంచేయగల వ్యక్తులు, ప్రదేశాలలో కన్పయిన్మెంట్ జోన్, బఫర జోన్ల అమలు అంశాలను డియం హెచ్ ఓ డా.బి.సత్యసుశీల, నోడల్ అధికారి డా.మల్లిక్ మంత్రులకు వివరించారు. కాకినాడ పార్లమెంట్ సభ్యులు వంగా గీతావిశ్వనాద్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో పర్యటించి కరోనా వైరస్ నియంత్రణకు జిల్లా అధికారులకు దిశా నిర్దేశం, ప్రజలకు ధైర్యం కల్పించనందుకు ఉపముఖ్యమంత్రి, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సమావేశంలో జిల్లా పోలీస్ సూపరింటెడెంట్ అద్నాన్ నయీమ్ అస్మి, జాయింట్ కలెక్టర్ జి.లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్-2 జి.రాజకుమారి, డిఆర్‌ఓ సిహెచ్.సత్తిబాబు, జిజిహెచ్ సూపరింటెండెంట్ డా.రాఘవేంద్రరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. (సమాచార శాఖ చేజారీ)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి