ఇళ్ల స్థలాల పంపిణీ లో భాగంగా భూ సేకరణ వేగవంతం చేయాలి;ముఖ్యమంత్రి కార్యాలయ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఐఏఎస్ అధికారులకు ఆదేశాలు

      నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల స్థలాల పంపిణీ లో భాగంగా భూ సేకరణ వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఐఏఎస్ అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లాలో పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాలకు  భూ సేకరణ సంబంధించిన పనులు క్షేత్ర స్థాయి పరిశీలన చేయుటకు జిల్లాకు విచ్చేసిన ప్రవీణ్ ప్రకాష్ జిల్లా కలెక్టర్ డి మురళీధర్రెడ్డి ,జాయింట్ కలెక్టర్ జి లక్ష్మి శ లతో కలిసి తాళ్ళరేవు  మండలం చొల్లంగి గ్రామం రాజీవ్ స్వగృహ లో ఉన్న 54 ఎకరాల భూములను మరియు కరప మండలం గురజనాపల్లి గ్రామంలో ఉన్న సాల్ట్ భూములను, అదేవిధంగా జెడ్ బావారంలో ఉన్న భూములను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ప్రవీణ్ ప్రకాష్ మాట్లాడుతూ వచ్చే ఉగాది నాటికి పేదలందరికీ  ఇళ్ల స్థలాపంపిణీ కార్యక్రమం ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నదని అధికారులు అందరూ లేఅవుట్లల ప్రిపరేషన్ పనులు వేగవంతం  చేసి పూర్తి చేయాలన్నారు.ఈ పర్యటనలో కాకినాడ రెవెన్యూ డివిజన్ అధికారి ఏ జి. చిన్ని కృష్ణ, తాళ్ళరేవు,కరప మండల తాసిల్దార్లు కె చిన్న బాబు, బి.విజయ భాస్కర్, వీఆర్వోలు, సర్వేయర్లు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు