ఎస్పీ కారాలయంలో స్పందన రద్దు
కోవిడ్ - 19 (కరోనా వైరస్) కారణంగా జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రతీ సోమవారం జరిగే స్పందన కార్యక్రమం రేపటినుండి రద్దు చేయడం జరిగింది. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని జిల్లా SP శ్రీ అద్నాన్ నయిం అస్మి గారు తెలియపరిచారు. ఫిర్యాదులు ఏమైనా ఉంటే జిల్లా ఎస్పీ వాట్సాప్ హెల్ప్ లైన్ నెంబర్ 9494933237 కు పోస్ట్ చేయవచ్చు లేదా డయల్-100 కు ఫోన్ చేసి చెప్పవచ్చని SP గారు చెప్పారు. అలాగే జిల్లా పోలీసు కార్యాలయం బయట ఒక కంప్లైంట్ బాక్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందని రాతపూర్వకమైన ఫిర్యాదులు స్వయంగా వచ్చి ఇవ్వాలి అని అనుకునే వాళ్ళు ఈ కంప్లైంట్ బాక్స్ లో ఫిర్యాదులు వేయవచ్చని వీటి పై కూడా తగిన చర్య తీసుకోబడుతుంది అనిఎస్పీ చెప్పారు. కరోనా వైరస్ ప్రభావం తగ్గేవరకు ఇకపై ప్రతీ సోమవారం ఈ ఏర్పాటు మాత్రమే ఉంటుందని స్పందన కార్యక్రమం ఉండదు అనే విషయాన్ని ప్రజలు గమనించాలని విజ్ఞప్తి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి