మహేష్ ఉన్నట్లా ... లేనట్లా ... నోరు మెదపరే...


మహేష్ బదులుగా చరణ్ నటించే వీలుంటుందన్న గుసగుసా వినిపిస్తోంది. ఇక రిలీజ్ తేదీకి సంబంధించిన డైలమా ఇంకా అలానే ఉందని అర్థమవుతోంది. అన్ని డైలమాలు క్లియర్ అవ్వాలంటే మెగాస్టార్- కొరటాల టీమ్ నోరు మెదపాల్సిందే.


                                                                                                            ఏదైనా సినిమా సెట్స్ కెళ్లాలంటే ఎన్నో విషయాలు ప్రస్థావనకు వస్తున్నాయి. అనుకూలమైన రిలీజ్ తేదీ.. సరిగ్గా కుదిరే కాంబినేషన్లు.. ఆర్టిస్టుల కాల్షీట్లు.. ప్రచారానికి కావాల్సినంత సమయం వగైరా వగైరా చూస్తున్నారు. పైగా బడ్జెట్ లోనే అన్నీ పూర్తవ్వాలి. బిజినెస్ సరిగా సాగాలి. రిలీజ్ తర్వాత బ్లాక్ బస్టర్ వసూళ్లతో అదరగొట్టాలి. అయితే ఇలాంటి క్యాలిక్యులేషన్స్ వల్ల కొన్నిటి రిలీజ్ డైలమాలు తప్పడం లేదు.                                                                                                                                                             ప్రస్తుతం చిరు కొరటాల సినిమాకి ఇలాంటి ఎన్నో సందిగ్ధతలు తలెత్తాయని ఓ సమాచారం లీకైంది. ఇప్పటికే మొదలైన ఈ సినిమా విషయంలో రకరకాల డౌట్లు పుట్టుకొస్తున్నాయి. ఈ మూవీలో ఓ కీలక పాత్ర కోసం చరణ్ ని ఖాయం చేశారని ఇంతకుముందు ప్రచారమైంది. ఆ తర్వాత చరణ్ కంటే మహేష్ అయితే బావుంటుదని చిరు భావించినట్టు వెల్లడైంది. కానీ ఏదీ అధికారికంగా ఖాయం చేయలేదు. కొరటాల బృందం ప్రకటించనూ లేదు. అయితే మహేష్ విషయంలో ఎంతో సైలెన్స్ కనిపించడంతో మెగాస్టార్ చిరంజీవి - మహేష్ కాంబినేషన్ కుదిరినట్టేనని అభిమానులు భావించారు. అయితే ఇంతలోనూ ఊహించని విధంగా ఈ కాంబినేషన్ కుదరడం లేదని తెలుస్తోంది.




                                                                                                             మహేష్ నే ఖాయం చేశారా?  లేక చరణ్ అయితేనే బావుంటుందా? అన్నది డైలమాలో పడింది. ఇక చిరులో సైతం ఈ డైలమా ఉన్నట్టే వాతావరణం చెబుతోంది. ఇక చిరు 152లో చరణ్ నటిస్తే ఆర్.ఆర్.ఆర్ కి ఇబ్బంది అని దాంతో రాజమౌళి మోకాలడ్డేశారని ఓ ప్రచారం హోరెత్తింది. అయితే దానిపైనా ఎలాంటి వివరణ లేదు. ఇక ఈ సినిమాని ఆగస్టు బరి నుంచి 2021 మార్చికి వాయిదా వేశారన్న ప్రచారం తాజాగా సాగుతోంది. మహేష్ బదులుగా చరణ్ నటించే వీలుంటుందన్న గుసగుసా వినిపిస్తోంది. ఇక రిలీజ్ తేదీకి సంబంధించిన డైలమా ఇంకా అలానే ఉందని అర్థమవుతోంది. అన్ని డైలమాలు క్లియర్ అవ్వాలంటే మెగాస్టార్- కొరటాల టీమ్ నోరు మెదపాల్సిందే.



కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు