పోలియో ఫండ్ కి అజయ్ రెడ్డి విరాళం
తూ.గో (కాకినాడ)
: రోటరీ పల్స్ పోలియో ఫండ్ కు నూతనంగా అధ్యక్షులుగా ఎన్నికైన బోయ అజయ్ రెడ్డి 25వేల రూపాయల విరాళాన్ని అందజేసారు. శుక్రవారం స్థానిక కాస్మాపాలిటన్ సమావేశ మందిరంలో జరిగిన ప్రత్యేక సమావేశంనందు రోటరీ డిస్ట్రిక్ట్ పోలియో ఫండ్ చైర్మన్ రంగారావుకు 25వేల రూ|| నగదును పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డా. ఎస్.వి.ఎస్. రావు చేతుల మీదుగా అందజేసారు. అజయ్ మాట్లాడుతూ 2021 సం||కి రోటరీ గోల్డెన్ జూబ్లీ అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా తొలి సేవా కార్యక్రమాన్ని ప్రారంభించాలన్న ఆశయంతో ప్రపంచ సమాజానికి ఉపయోగపడే ప్రాజెక్టుకు ఈ విరాళాన్ని అందిస్తున్నానని దీనివల్ల ప్రపంచంలో దివ్యాంగుల జననం ఉత్పన్నం కాకుండా రోగనిరోధక శక్తి పెంపొందించేందుకు అవసరమైన వ్యాక్సిన్ పుట్టిన చిన్నారి పిల్లలకు రోటరీ తరపున ఉచితంగా వేయడం జరుగుతోందని వివరించారు. నవజాత శిశువులనుండి 5 సం|| వరకు పిల్లలకు పోలియో వ్యాక్సిన్ వేయడంద్వారా భవిష్యత్ లో వారికి దివ్యాంగుల సమస్య ఉత్పన్నం కాదని దానివల్ల సమాజానికి మరియు కుటుంబానికి ఎంతో ఊరట కలిగిస్తోందని చెప్పారు. రోటరీ డిస్ట్రిక్ట్ పోలియో ఫండ్ చైర్ పర్సన్ రంగారావు మాట్లాడుతూ పోలియో ఫండ్ కు అందించే విరాళాలు ప్రపంచవ్యాప్తంగా సద్వినియోగం చేయడమేకాక ఆరోగ్యవంతమైన శిశువుల ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతోందని చెప్పారు. రోటరీ సభ్యులేకాక వారి మిత్రులు మరియు సమాజంలో నివశిస్తున్నవారు రోటరీ పోలియో ఫండ్ కు విరాళాలను అందించిన యెడల భవిష్యత్ తరాల సంపదగా భావించే భావితరాల పిల్లలు ఆరోగ్యవంతమైన అంగవైకల్యంలేని జీవితాలను అందించిన వారమవుతామని చెప్పారు. రోటరీ గోల్డెన్ జూబ్లీ క్లబ్ లో చాలామంది సభ్యులు పోలియోఫండ్ కు స్వచ్చందంగా విరాళాలు అందించడానికి క్లబ్ అధ్యక్షులు డా. సతీష్ చేస్తున్న కృషిని ప్రత్యేకంగా కొనియాడారు. పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డా. ఎస్.వి.ఎస్.రావు మాట్లాడుతూ మన జీవితకాలంలో ఎన్నో సేవాకార్యక్రమాలు నిర్వహిస్తు ఆర్ధికంగా సహకరిస్తున్నామని దానితోపాటు రోటరీ పోలియోఫండ్ కు ఇచ్చే విరాళం ఎంతో గొప్ప సేవా కార్యక్రమంగా అందరూ భావించాలని కోరారు. భావితరాల పిల్లలకు ఏ విధమైన అంగవైకల్యం రాకుండా అరికట్టేందుకు పోలియో వ్యాక్సిన్ ఎంతో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో రోటరీ అసిస్టెంట్ గవర్నర్ డా. టి.వి. బాలకృష్ణ, క్లబ్ అధ్యక్షులు డా. సతీష్, కోశాధికారి నల్లమిల్లి మాచారెడ్డి, ఉదయభాను, సత్తిరవిరెడ్డి, డా. రామకృష్ణ, లంక సాయిబాబుతోపాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి