బ్లీచింగ్, ఇతర శానిటరీ సామాగ్రిని రాష్ట్ర స్థాయిలో కొనుగోలు ద్వారా సరఫరా చేయాలి
కాకినాడ :
కరోనా వైరస్ నియంత్రణ కొరకు గ్రామీణ, పట్టన ఆవాసాల్లో విస్తృతంగా చేపడుతున్న పారిశుద్య కార్యక్రమాల కొరకు బ్లీచింగ్, ఇతర శానిటరీ సామాగ్రిని రాష్ట్ర స్థాయిలో కొనుగోలు ద్వారా సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ డి.మురళీధర రెడ్డి రాష్ట్ర అధికారులను కోరారు. గురువారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డిజిపి గౌతం సవాంగ్ సంయుక్తంగా జిల్లా కలెక్టర్లు, ఎస్ పిలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కరోనా వైరస్ కట్టిడి చర్యలలో భాగంగా విదేశాల నుండి వచ్చిన వ్యక్తుల గుర్తింపు, ఐసోలేషన్లో పర్యవేక్షణ, లాక్ డౌన్ పటిష్ట అమలు, నిత్యావసర వస్తువుల సరఫరా, రవాణా అంశాల పై సమీక్షించి ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్బంగా తెలంగాణా సరిహద్దులను దాటుకుని, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల మీదుగా జిల్లాకు చేరుకున్న 240 మంది వ్యక్తులను తప్పని సరిగా ఐసోలేషన్ కేంద్రాలలో పర్యవేక్షణలో ఉంచాలని ప్రధాన కార్యదర్శి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. జిల్లా నుండి ఇండెంట్ చేసిన పిపిఈ కిట్లు, ఎన్ 95 మాస్క్ లు నాలుగ రోజుల్లో సరఫరా చేస్తామని, కరోనా వైరస్ అనుమానిత కేసులను అటెండ్ అవుతున్న వైద్య సిబ్బంది, డాక్టర్లు అందరికీ వాటిని పంపిణీ చేయాలని సూచించారు. వైరస్ నిరోధం, లాక్ డౌన్ అమలు అంశాల కొరకు ప్రతి జిల్లాకు 2 కోట్లు నిధులు కేటాయిస్తున్నామని సిఎస్ తెలియజేశారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ మురళీధర రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో నిత్యావసర సరకుల రవాణా, పంపిణీకి అవరోధాలు లేకుండా అన్ని చర్యలు చేపట్టామన్నారు. పారిశుద్య కార్యక్రమాల నిర్వహణకు అవసరమైన బ్లీచింగ్, ఇతర సామగ్రి కొనుగోలులో ఎదురౌతున్న సమస్యలను వివరించి వాటిని రాష్ట్ర స్థాయి కొనుగోలు ద్వారా జిల్లాకు సరఫరా చేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్ పి అద్నాన్ నయీమ్ అస్మి, జాయింట్ కలెక్టర్ జి.లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్-2 జి.రాజకుమారి , డి ఎం హెచ్ ఓ సత్యసుశీల, జిజిహెచ్ సూపరింటెండెంట్ రాఘవేంద్రరావు, నోడల్ అధికారి మల్లిక్ తదితరులు పాల్గొన్నారు. )
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి