దేశంలో కరోనా దూకుడు...

కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం భారత్‌లో ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న కరోనా కేసుల సంఖ్య 1117. కోవిడ్ కారణంగా ఇప్పటి వరకూ 32 మంది మరణించగా.. 101 మంది కోవిడ్ బారి నుంచి కోలుకున్నారు. 




                                                                                                        భారత్‌లో  కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళల్లో కోవిడ్ కేసులు ఎక్కుగా నమోదు అవుతున్నాయి. మహారాష్ట్రలో కోవిడ్ కేసుల సంఖ్య 300 దాటింది. ఈ రాష్ట్రంలో 72 మందికి కొత్తగా కోవిడ్ సోకినట్లు నిర్ధారించగా..      మంగళవారం సాయంత్రం  వరకు మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 302కు చేరింది. సోమవారం ఒక్క ముంబైలోనే 59 మందికి కరోనా నిర్ధారణ కాగా.. పుణే, థానే, కళ్యాణ్-డొంబివిలీ, నవీ ముంబై, వషి విరార్‌లలో ఇద్దరు చొప్పున కరోనా సోకినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.మరోవైపు కేరళలో మంగళవారం కొత్తగా ఏడు కేసులను గుర్తించారు. కేరళలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 215కు చేరిందని సీఎం పినరయి విజయన్ తెలిపారు. తిరువనంతపురంలో కోవిడ్ పేషెంట్ ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో కేరళలో కోవిడ్ మృతుల సంఖ్య రెండుకు చేరింది.






 



కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు