ఎన్నికల కమీషన్ ఎన్నికల ప్రవర్తనావళిని అనుసరించి విధులు నిర్వర్తించాలి ;కలెక్టర్
తూ .గో.. ;మండల ప్రజా పరిషత్ జిల్లా, ప్రజా పరిషత్ ఎన్నికల నిర్వహణకు నియమించిన రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులు ఎన్నికల సజావుగా నిర్వహించడానికి పూర్తి స్థాయిలో రాష్ట్ర ఎన్నికల కమీషన్ ఎన్నికల ప్రవర్తనావళిని అనుసరించి విధులు నిర్వర్తించాలని జిల్లా కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి ఆదేశించారు. ఆదివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సిఇఓ యం.జ్యోతి అధ్యక్షతన జరిగిన రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింట్ అధికారులకు ఎన్నికల శిక్షణా తరగతులు జరిగాయి. ఈ శిక్షణా తరగతులు జిల్లా కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తనావళిని అనుసరించి ఆజ్లు, ఎఆర్ఓలు విధులు నిర్వర్తించి ఎన్నికలను సజావుగా నిర్వర్తించాలని సూచించారు. ఎన్నికల సమయం తక్కువగా వున్నందున అధికారులు కాలాన్ని వృధా చేయకుండా మార్గదర్శకాలు పాటించాలని తెలిపారు. ఎన్నికల నామినేషన్ నుండి ఏరోజు నివేదిక ఆదే రోజు సాయంత్రం సిఇఓ కార్యాలయానికి పంపాలని అన్నారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీ లేకుండా చూడాలని అన్నారు. డబ్బు, మద్యం పంపిణీ జరిగినట్లు మీ దృష్టికి వస్తే జిల్లా యంత్రాంగం కట్టిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఎన్నికల కోడ్ నిన్నట రోజు నుండి అమలులో వచ్చినందున మండల పరిధిలో కొత్తగా ఏ విధమైన ప్రభుత్వ పధకాలు చేపట్టకూడదని చెప్పారు. బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్ విషయంలో ఆర్ఓలు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఈ నెల 14వ తేదీన నామినేషన్ ఉప సంహరణ అనంతరం పోటీలో వున్న అభ్యర్థుల సమాచారంతో ప్రింటింగ్ కు ఇవ్వవలసిన అవస్యకత వుందన్నారు. గ్రామవాలంటీర్లు, ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల్లో అచ్చత్సాహంతో రాజకీయ పార్టీలు పోటీలో ఉన్న అభ్యర్థుల వారితో తిరిగినట్లు సమాచారం వస్తే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల సందర్భంగా మండలాల్లోను, జిల్లాలలోను, డివిజన్ లల్లో సోమవారం నాడు జరుగు స్పంధన కార్యక్రమాన్ని నిలుపుదల చేస్తున్నట్లు తెలిపారు. త్రాగునీరు, సాగునీరు, తదితర ప్రదానమైన సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడితే అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని అన్నారు. ఎన్నికల అధికారులకు ఎన్నికల కమీషనర్ ముద్రించిన రిటర్నింగ్ అధికారి విధులు, ఎన్నికల నియమ నిబందనలు సంబంధించిన పుస్తకంను పూర్తి స్థాయిలో అవగాహన చేసుకుని ఎటువంటి పోరపాట్లు జరగకుండా ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని కలక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలక్టర్-2 జి.రాజకుమారి రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు శిక్షణ ఇస్తూ ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలక్టర్-2 జి.రాజకుమారి రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు శిక్షణ ఇస్తూ 9వ తేదీ నోటిఫికేషన్ కార్యాలయ నోటీష్ బోర్డులో ఉంచాలని ఈ నెల 9వ తేదీ నుండి 11వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, 12వ తేదీన నామినేషన్ పరిశీలన, 13వ తేదీన తిరస్కరించబడిన నామినేషన్ల విషయమై ఆ డ్రె ఓ, జిల్లా కలక్టర్కు పంపడం, 14వ తేదీన మధ్యాహ్నం ఒంటిగంట లోపు అప్పిల్ల పరిష్కరణ, 14వ తేదీన మద్యాహ్నం 3గంటల లోపు నామినేషన్ ఉపసంహరణ చివరి తేదీ కాగా 3గంటల తరువాత పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రచురణ కార్యక్రమం, పోలింగ్ నిర్వహణ మార్చి 21వ తేదీన ఉదయం 7 గంటల నుండి సాయం 5గంటల వరకు నిర్వహించాలని ఆమె చెప్పారు.
ఎమ్.పి.టిసిల తాలుకా అన్ని నామినేషన్లు మండల ప్రజా పరిషత్ నందు స్వీకరించాలని తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ సూచించిన సూచనలు అధికారులు క్షుణంగా తెలుసుకోవాలన్నారు. ఎమ్.పి.టి.సిల పొటీ చేసే అభ్యర్థులు ఆ అర్హతను పొందుటకు ఆ అభ్యర్థి పేరు, సదరు మండల ప్రజాపరిషత్ ఓటరు జాబితా యందు తప్పక ఓటరుగా నమోదై యుండాలని అన్నారు. అలాగే 21 సంవత్సరం పూర్తి చేసుకుని వుండాలని తెలిపారు. ఎమ్.పి.టి.సి సభ్యుని యొక్క ప్రతిపాధకుడు కూడా మండల పరిషత్ లో ఓటరుగా నమోదైయండాలి. పోటీ చేయుచున్న అభ్యర్థులు ఎస్.సి, ఎస్.టి, బిసిలకు కట్టవలసిన డిపాజిట్ సొమ్ము రూ.1500 లు, జెడ్.పి.టి.సి నెంబరుకి రూ.3వేల లు సొమ్ము నామినేషన్ రోజున చెల్లించాలని చెప్పారు. ఎస్.సి, ఎస్.టి, బిసి కానివారు ఎమ్.పి.టి.సి రూ.3వేలు, జెడ్.పి.టి.సి కి 6వేలు చెల్లించాలని తెలిపారు. డిక్లరేషన్ పూర్తి చేయునప్పుడు అన్ని వివరాలను వదలకుండా నింపాలని, సమాచారం లేని యడల వరించబడదు వివరాలను రాయాలని తెలిపారు. ఎన్నికల ప్రచారానికి రాజకీయ పార్టీల మీటింగులు, ర్యాలీ కి పోలీస్, రిటర్నింగ్ అధికారి అనుమతి తీసుకోవాలని తెలిపారు. ఎన్నికల ప్రచారానికి రాజకీయ పార్టీల మీటింగులు, ర్యాలీ కి పోలీస్, రిటర్నింగ్ అధికారి అనుమతి తీసుకోవాలని తెలిపారు. ప్రచారం నిమిత్తం ఆటోలు రెండు స్పీకర్లతో ఉదయం 6గంటల నుండి రాత్రి 10గంటల వరకు మాత్రమే అనుమతించాలని చెప్పారు. పోలింగ్ కు 48గంటల ముందే అనగా 19వ తేదీ సాయంత్రం 5 గంటల ప్రచారం నిలిపివేయాలని తెలిపారు. నామినేషన్లు కేంద్రాలయిన మండల ప్రజా పరిషత్ 100మీటర్ల దూరంలో వాహనాలు, ప్రజలు అనుమతించకూడదని చెప్పారు. నామినేషన్ వేసే అభ్యర్థితో పాటు ఇద్దరు ప్రతిపాధకులతో కలిసి ముగ్గురు మాత్రమే అనుతిస్తారని చెప్పారు. అభ్యర్థుల ఖర్చులు, పోలింగ్ మెటీరియల్, బ్యాలెంట్ బాక్సులు తదితర అంశాల పై జెసి-2 శిక్షణ ఇవ్వడం జరిగింది. అనంతరం మద్యాహ్నం మాష్టర్ ట్రైనీర్లతో ఎన్నికల సహాయ సిబ్బందికి శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిపిఓ నాగేశ్వర నాయక్, 62 మండలాల రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి