ప్రభుత్వ తీరును తప్పుబట్టిన ఈ సి ;ఆరువారాలపాటు కొనసాగనున్న ఎన్నికల కోడ్
.మహమ్మారి కరోనా వైరస్ ప్రభావాన్ని కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించిన నేపథ్యంలో ఏపీ ఎన్నికల సంఘం కూడా అదే రీతిగా అసాధారణ నిర్ణయాన్ని వెలువరించింది.
ఎన్నికలు వాయిదా పడిన ఆరు వారాలపాటూ కోడ్ అమలులోనే ఉంటుందని, ఈ గ్యాప్ లో అభ్యర్థుల భద్రతకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని ఈసీ నిమ్మగడ్డ స్పష్టం చేశారు. నామినేషన్లు పూర్తయిన చోట అభ్యర్థుల్ని కాపాడుకోవడం, వాళ్లకు హాని జరగకుండా చూసుకోవడాన్ని అధికారులు సవాలుగా తీసుకోవాలని, ఇందుకోసం ఉన్నతస్థాయిలో సీఎస్, డీజీపీ, ఆయా శాఖల ముఖ్య అధికారులుకు ఈసీ ఆదేశాలిస్తుందని, అలాగే జిల్లా స్థాయిలోనూ కలెక్టర్లు, ఇతర అధికారులకు కూడా విధివిధానాలు జారీచేస్తామని ఆయన ప్రకటించారు. వైసీపీ దాడులపై ప్రతిపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ తదితర పార్టీలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినదానికి అనుగుణంగా ఈసీ కూడా ప్రభుత్వం తీరును తప్పుపట్టేలా మాట్లాడటం గమనార్హం.మహమ్మారి కరోనా వైరస్ ప్రభావాన్ని కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించిన నేపథ్యంలో ఏపీ ఎన్నికల సంఘం కూడా అదే రీతిగా అసాధారణ నిర్ణయాన్ని వెలువరించింది. స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాలపాటు వాయిదా వేసింది. ఆరువారాల తర్వాత పరిస్థితులను బట్టి ఎన్నికల ప్రక్రియను పున:ప్రారంభిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ చెప్పారు. ఈ ఆరు వారాలపాటూ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ యధావిధిగా అమలవుతోందన్న ఆయన... వైసీపీ సర్కారుపై వెల్లువెత్తుతున్న విమర్శలపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ, కీలక ఆదేశాలు జారీచేశారు.మాచర్లలో టీడీపీ నేతలపై హత్యాయత్నం మొదలుకొని.. దాదాపు అన్ని జిల్లాల్లో అధికార పార్టీ నేతలు.. ప్రతిపక్ష అభ్యర్థుల నామినేషన్లను అడ్డుకున్నారని, తద్వారా ఆయా స్థానాలను ఏకగ్రీవం చేసుకునేందుకు ప్రయత్నించారని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. వీటికి సంబంధించిన పలు వీడియోలు, ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి. వైసీపీ అక్రమాలకు సంబంధించి మీడియా రిపోర్టులు తమ దృష్టికి వచ్చాయని ఈసీ రమేశ్ కుమార్ చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల గ్రామవాలంటీర్లు.. అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారంటూ ఫిర్యాదులు అందాయని, వాటిపై విచారణ జరపనున్నట్లు ఈసీ తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికల ప్రక్రియకు ఎవరు అడ్డంపడినా లేదా విఘాతం కలిగించినా కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. ఎన్నికల వాయిదా వ్యవహారంలో రాజకీయ కోణం లేనేలేదని, కరోనాపై కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా, ఈసీ తనకున్న విశేషాధికారాలను వాడుకుని ఈ నిర్ణయానికి వచ్చిందని ఆయన వివరించారు.
ఎన్నికలు వాయిదా పడిన ఆరు వారాలపాటూ కోడ్ అమలులోనే ఉంటుందని, ఈ గ్యాప్ లో అభ్యర్థుల భద్రతకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని ఈసీ నిమ్మగడ్డ స్పష్టం చేశారు. నామినేషన్లు పూర్తయిన చోట అభ్యర్థుల్ని కాపాడుకోవడం, వాళ్లకు హాని జరగకుండా చూసుకోవడాన్ని అధికారులు సవాలుగా తీసుకోవాలని, ఇందుకోసం ఉన్నతస్థాయిలో సీఎస్, డీజీపీ, ఆయా శాఖల ముఖ్య అధికారులుకు ఈసీ ఆదేశాలిస్తుందని, అలాగే జిల్లా స్థాయిలోనూ కలెక్టర్లు, ఇతర అధికారులకు కూడా విధివిధానాలు జారీచేస్తామని ఆయన ప్రకటించారు. వైసీపీ దాడులపై ప్రతిపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ తదితర పార్టీలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినదానికి అనుగుణంగా ఈసీ కూడా ప్రభుత్వం తీరును తప్పుపట్టేలా మాట్లాడటం గమనార్హం.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి