9 ఆల్ట్రా సౌండ్ స్కానింగ్ కేంద్రాలకు రిజిస్ట్రేషన్ కు, 8 కేంద్రాలకు అనుమతుల రెన్యువల్
తూ .గో ;జిల్లాలో నిబంధనలు పాటిస్తూ క్రొత్తగా ఏర్పాటుకు ధరఖాస్తు చేసుకున్న 9 ఆల్ట్రా సౌండ్ స్కానింగ్ కేంద్రాలకు రిజిస్ట్రేషన్ కు, 8 కేంద్రాలకు అనుమతుల రెన్యువల్ కు జిల్లా స్థాయీ అధారిటీ, అడ్వయిజరీ కమిటీ ఆమోదం జారీ చేసింది. బ్రూణ హత్యలు, బాలికా శిశువుల పట్ల వివక్ష నిరోధం లక్ష్యంగా ఏర్పాటైన గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చట్టం పటిష్ట అమలు పర్యవేక్షణకు ఏర్పాటైన జిల్లా స్థాయి అడ్వయిజరీ కమిటీ సమావేశం కలెక్టరేట్ వివేకానంద సమావేశ హాలులో డియం హెచ్ ఓ డా.బి.సత్యసుశీల అధ్యక్షతన జరిగింది. సమావేశంలో చట్టంలో నిర్దేశించిన నిబంధనలను సక్రమంగా పాటిస్తున్న ఆల్ట్రా సౌండ్ స్కానింగ్ సెంటర్లుకు క్రొత్త అనుమతులు, రెన్యూవల్, మిషన్లు, అడ్రసు మార్పులను కమిటీ ఆమోదించింది. అలాగే అల్ట్రా సౌండ్ సెంటర్ల పై రహస్య నిఘా పాటిస్తూ డెకాయ్ ఆపరేషన్స్ నిర్వహణకు, అక్రమాలకు పాల్పడే వారి సమాచారం తెలిపేందుకు ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ ఫోన్ నెంబరు చార్జీల కొరకు చేసిన వ్యయాన్ని కమిటీ ఆమోదించి, రహస్య నిఘాను మరింత పెంచాలని అధికారులను కోరింది. ఈ సమావేశంలో 4వ అదనపు జిల్లా జడ్జి ఎన్.శ్రీనివాసరావు, అడిషనల్ డియం హెచ్ ఓలు డా. శైలజ, డా.రమేష్, డిప్యూటీ డియం హెచ్ ఓ డా.కోవుల, డిఐఓ డా.మల్లిక్, క్రైం బ్రాంచి సిఐ వైఆర్కే శ్రీనివాసరావు, ఏపిపి టి.శ్రీనివాసమూర్తి, డిటిసి ఓ డా.ప్రసన్నకుమార్ , స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కె.వెంకటేశ్వరరావు, ఎస్.అప్పల నాయుడు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి