మరో కరోనా కేసు నమోదు ;తోలి కరోనా మృతి కర్ణాటకదే ,,దేశంలో 80కి చేరిన కోవిడ్ కేసులు.అబ్జర్వేషన్‌లో 900 మంది
తెలంగాణ రాజధాని హైద్రాబాద్ లో చికిత్స పొంది కర్ణాటకలోని తన స్వగ్రామం కలబుర్గికి వెళుతున్నమహ్మద్ హుస్సేన్ సిద్దిఖీ(76) కరోనా వ్యాధితో మార్గ మధ్యలోనే మృతి చెందాడు.. ఇది జరిగిన కొద్దీ గంటల్లోనే మరో కరోనా కేసు నమోదు అయింది
వుహాన్ నుంచి తిరిగొచ్చిన స్టూడెంట్‌కు కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దేశంలో నమోదైన తొలి మూడు కేసులు కేరళకు సంబంధించినవే. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కారణంగా ఇండియాలో ఒక వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. ఇది దేశంలోనే తొలి మృతి. కర్ణాటకలోని కలబుర్గికి చెందిన మహ్మద్ హుస్సేన్ సిద్దిఖీ(76) కరోనా బారిన పడి మృతిచెందాడు. ఈ విషయాన్ని కర్నాటక వైద్య ఆరోగ్యశాఖ మంత్రి బి.శ్రీరాములు ధ్రువీకరించారు. కరోనా సోకిన తర్వాత నుంచి చనిపోయేలోపు సిద్దిఖీ ఎవరెవర్ని కలిశాడు? ఏ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకున్నాడు? అసలు ఎక్కడి నుంచి హైదరాబాద్‌కు వచ్చాడు? తదితర విషయాలు కీలకంగా మారాయి. సిద్దిఖీ హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందాడు. గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సిఫార్సు చేయగా.. అతని కుటుంబ సభ్యులు స్వగ్రామానికి తీసుకెళ్లారు. అతడు వెళ్తుండగానే చనిపోయాడు. కేర్ ఆస్పత్రి వర్గాలు చెప్పిన వివరాల ప్రకారం.. మహమ్మద్ హుస్సేన్ సిద్ధిఖీ సౌదీ అరేబియాలో పర్యటించిన ఇటీవల స్వస్థలానికి వచ్చాడు. అప్పటి నుంచి అనారోగ్య పాలవడంతో మార్చి 5న బీదర్‌లోని ఆస్పత్రిలో చేరాడు. అక్కడ 3 రోజుల పాటు చికిత్స తీసుకున్నాడు. ఆస్పత్రి వర్గాలు అతడి రక్త నమూనాలు సేకరించి పూణెకు పంపించారు.అయితే, ఆ నివేదిక వచ్చేలోపే సిద్దిఖీని అతడి కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. కేర్ ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు అతడ్ని పరీక్షించి కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించి, వెంటనే ఐసోలేషన్ వార్డుకు తరలించారు. ఆస్పత్రి వర్గాలు బీదర్ ఆస్పత్రికి ఫోన్ చేసి వివరాలు అడగ్గా.. మూడ్రోజులు అక్కడ ఉన్నట్లు చెప్పారు. తర్వాత సిద్దిఖీని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. అయితే, కుటుంబ సభ్యులు వాళ్ల కలబుర్గికి తీసుకెళ్లేందుకే మొగ్గు చూపారు. మార్గమధ్యలోనే అతడు మృతి చెందాడు. ఇదిలా ఉండగా, బీదర్ ఆస్పత్రిలో చేర్పించాక అతడ్ని ఎందుకు డిశ్చార్జి చేశారు? ఆస్పత్రిని విడిచి వెళ్లడానికి పర్మిషన్ ఎలా ఇచ్చారు? ప్రభుత్వ అధికారులకు సమాచారం ఇచ్చారా? హైదరాబాద్‌కు ఎలా తీసుకొచ్చారు? అతడి వెంట ఎవరెవరు ఉన్నారు? ఫ్యామిలీలో ఇంకెవరికైనా వైరస్ సోకిందా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.కాగా, కేర్ ఆస్పత్రిలో చేరే కంటే ముందే సిద్దిఖీని సిటీ న్యూరో ఆస్పత్రికి, అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఆ ఆస్పత్రి వర్గాలు కేసును టేకప్ చేసేందుకు ఒప్పుకోకపోవడంతో కేర్ ఆస్పత్రికి తీసుకొచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో ఎంతమందికి వైరస్ సోకిందనేది మరో ప్రశ్నగా మిగిలింది. మరోవైపు, సిద్దిఖీకి వైద్యం చేసిన డాక్టర్లు, నర్సు స్టాఫ్‌ను వేరు చేశారు. అతడు 45 నిమిషాల పాటు అత్యవసర వార్డులో ఉన్నందున.. వైద్యం చేసిన వాళ్లకు వైరస్ సోకిందేమోనన్న అనుమానంతో వారికి పరీక్షలు నిర్వహిస్తున్నారు.దేశంలో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా శుక్రవారం మరో ఎనిమిది కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్‌లో కోవిడ్ బాధితుల సంఖ్య 80కి చేరుకుంది. మనేసర్‌లోని క్యారంటైన్ కేంద్రంలో ఉన్న ఇటలీ నుంచి వచ్చిన భారతీయుడికి కరోనా వైరస్ నిర్ధారణ అయ్యింది. చైనాలోని వుహాన్ నగరంలో ప్రారంభమైన ఈ వైరస్ ఇప్పుడు 134 దేశాలకు వ్యాపించింది. దీని ప్రభావం భారత్‌లోనూ బలంగానే ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్‌ను మహమ్మారిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అంటార్కిటికా తప్ప అన్ని ఖండాల్లోనూ ఈ అంటువ్యాధి వేగంగా ప్రబలుతోంది. మార్చి తొలివారంలో భారత్‌లో ఒకే రోజు రెండు కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. అప్పటి నుంచి దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. కానీ పరిస్థితి అదుపులోనే ఉంది.కరోనా వైరస్ కారణంగా ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించే ప్రక్రియ కేంద్రం వేగవంతం చేసింది. ఇందులో భాగంగా శుక్రవారం రెండో విడతలో 44 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. శుక్రవారం ఉదయం 6.52 గంటలకు టెహ్రాన్ నుంచి బయలుదేరిన ఐఆర్- 810 విమానం మధ్యాహ్నం 1.00 గంటకు ముంబయికి చేరుకుంది. మొత్తం 44 మంది స్వదేశానికి రాగా.. వీరిలో 21 మంది మహిళలు ఉన్నారు. ఇరాన్‌లోని చిక్కుకున్న 100 భారతీయుల రక్త నమూనాలను వారం రోజుల కిందట మహన్ విమానయాన సంస్థకు చెందిన విమానం ఢిల్లీకి తీసుకొచ్చింది. ఈ నమూనాల పరీక్షించి వైరస్ లేదని నిర్ధారణ అయినవారిని భారత్‌కు తీసుకురావాలని నిర్ణయించారు. శనివారం తొలి విడతగా 58 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్న విషయం తెలిసిందే.
ఫలితాల్లో వైరస్ నిర్ధారణ కాకపోయినా స్వదేశానికి తీసుకొచ్చి తర్వాత నిర్బంధంలో ఉంచుతారు. తాజాగా, ఇరాన్ నుంచి వచ్చిన భారతీయులకు రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో ప్రత్యేక శిబిరం ఏర్పాటుచేశారు. ఎయిరిండియా విమానంలో వారిని అక్కడకు తరలించారు. ఈ కేంద్రంలో మొత్తం 120 మంది ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఆర్మీ సదరన్ కమాండ్ ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని ఏర్పాటుచేసినట్టు అధికారులు వెల్లడించారు. కరోనా వైరస్ భయంతో విమానాశ్రయాలను ఇరాన్ మూసివేయడంతో దాదాపు 6,000 మంది భారతీయులు అక్కడ చిక్కుకున్నట్టు కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ వెల్లడించారు.ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయుల్లో సింహభాగం కార్గిల్ ప్రాంతానికి చెందిన షియా యాత్రికులే ఉన్నారు. భారత్‌లో చిక్కుకున్న 2,000 మంది ఇరాన్ పౌరులను కూడా వారి దేశానికి తీసుకెళుతున్నారు. ఇరాన్ ఎయిర్, మహన్ ఎయిర్ సంస్థల ఢిల్లీ, ముంబైలకు విమానాలు నడుపుతున్నాయి. కరోనా వైరస్ తీవ్రకావడంతో ఫిబ్రవరి 25 నుంచి ఇరాన్ నుంచి విమానాల రాకపోకలను భారత్ నిలిపివేసింది.మరోవైపు, ఉత్తరప్రదేశ్, హర్యానాలో అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. యూపీలో కోవిడ్ కేసులు 11కి చేరడంతో మార్చి 22 వరకు కాలేజీలు, స్కూల్స్ మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కేరళలోని పత్తనంథిట్టా జిల్లాల్లో దాదాపు 900 మంది కరోనా అనుమానితులను స్వీయ నిర్బంధంలో ఉంచారు. ఈ జిల్లాలోనే ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి కరోనా వైరస్ నిర్ధారణ కావడంతో వారితో కాంటాక్ట్‌లో ఉన్న అందరినీ అధికారులు గుర్తించారు. వారితో సన్నిహితంగా ఎవరు మెలిగారనేది తెలుసుకోడానికి రూట్ మ్యాప్ విడుదల చేశారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి