కరోనానివారణకు పోలీస్ యంత్రాంగం చర్యలు
తూ.గో ;కరోనా వైరస్ నివారణ కార్యక్రమాలలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగా పోలీస్ శాఖ నందు రెండుటాస్క్ ఫోర్స్ టీమ్ లను ఏర్పాటు చెయ్యడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ అద్నాన్ నయుం అస్మి మాట్లాడుతూ ఒక్కొక్క టీం కు 1 యస్. ఐ., 10 మంది సిబ్బంది చొప్పున మొత్తం 22 మంది ఉంటారని వీరిలో మహిళా సిబ్బంది కూడా ఉంటారని , వీరు మెడికల్ సిబ్బందికి సహాయం గా ఉంటారని ఏదైనా ప్రత్యేక పరిస్థితుల్లో ఎవరైనా కరోనా వైరస్ లక్షణాలు కలిగిన వారు వైద్యం చేయించుకోవడానికి ఏమైనా ఇబ్బంది పెట్టినా , మెడికల్ సిబ్బంది పై ఏమైనా దురుసుగా ప్రవర్తించే సందర్భంలో పోలీస్ శాఖకు చెందిన ఈ స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీములు వారికి సహాయం గా వుండి రోగికి చికిత్స చేసేందుకు సహకరిస్తారని, అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని స్టేషన్లలో కూడా కరోనా వ్యాధికి సంబంధించిన పేషెంట్లను హాస్పిటల్స్ కు తరలించే సందర్భంలో మెడికల్ సిబ్బందికి అవసరమైతే అందుబాటులో ఉండాలని అన్ని స్టేషన్లకు ఆదేశాలు ఇచ్చామని ఎస్పీ తెలిపారు . ప్రజలు కూడా ఇది గమనించి అందరూ వైద్య మరియు పోలీస్ సిబ్బందికి , జిల్లా యంత్రాగానికి సహకరించాలని సూచించారు. దీనిలో భాగంగా ఈరోజు తూర్పు గోదావరి జిల్లాఎస్పీ అద్నాన్ నయుం అస్మి సారధ్యంలో జిల్లా పోలీసు కార్యాలయం నందు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ అవగాహన కార్యక్రమమునకు అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా కె. సత్యనారాయణ హాజరై కరోనా నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి విపులంగా వివరించారు. వారికి సూట్ ఎలా ధరించాలి, ఛేజ్ లు , మాస్క్ లు ఉపయోగించే విధానం , పేషెంట్లను ఎలా డీల్ చెయ్యాలి అనే విషయాలు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమములోఅడిషనల్ డేఎం అండ్ హెచ్ ఓ .డా. కె.సత్యనారాయణ,ఓ ఎస్డి.ఆరిఫ్ హాఫిజ్ ,అడిషనల్ సీపీ (అడ్మిన్) కె. కుమార్,ఎసిబి డిఎస్పీ లు,ఎం. అంభికా ప్రసాద్,ఎస్.మురళీమోహన్ , కాకినాడ ఇంచార్జ్ డిఎస్పీ వి. భీమారావు, ఇతర అధికారులు సిబ్బంది మరియుటాస్క్ ఫోర్స్ టీమ్ లు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి