మరణించిన తల్లి ... చివరి చూపు కొరకు 650 కి. మీ నడక

ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసికి చెందిన మురకీం అనే ఓ 25 ఏళ్ల వ్యక్తి బతుకుదెరువు కోసం ఛత్తీస్‌గఢ్‌లోని రాయపూర్‌కు వచ్చి పని చేసుకుంటున్నాడు. సరిగ్గా ఇదే సమయంలో వారణాసిలో తన తల్లి మరణించింది.


 



                                                                                                                                                                                                                                                       కరోనా వైరస్‌ను తరిమి కొట్టేందుకు దేశ వ్యాప్తంగా ప్రధాని మోదీ ప్రభుత్వం 21 రోజుల పాటు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దేశ సంరక్షణ కోసం ఈ చర్య అనివార్యమైనప్పటికీ, ఇది పలువురు సామాన్యులను కంటతడి పెట్టిస్తోంది. గతంలో పట్టణాలకు వలస వచ్చిన ఎంతో మంది బతుకుతెరువు లేక తిరిగి కాలినడకన వెళ్లి పోతున్న సంగతి తెలిసిందే. తాజాగా కంట తడి పెట్టించే ఇలాంటి ఓ ఘటన ఛత్తీస్‌గఢ్‌లో చోటుచేసుకుంది.ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసికి చెందిన మురకీం అనే ఓ 25 ఏళ్ల వ్యక్తి బతుకుదెరువు కోసం ఛత్తీస్‌గఢ్‌లోని రాయపూర్‌కు వచ్చి పని చేసుకుంటున్నాడు. సరిగ్గా ఇదే సమయంలో వారణాసిలో తన తల్లి మరణించింది. ఈ వార్త అతనికి వెంటనే మార్చి 25న తెలిసినప్పటికీ లాక్ డౌన్ కారణంగా వెళ్లలేకపోయాడు. రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. దీంతో చేసేది లేక, రాయ్‌పూర్‌ నుంచి వారణాసికి కాలినడకన వెళ్లడానికి మురకీం సిద్ధపడ్డాడు. అయితే, రాయ్‌పూర్‌ నుంచి వారణాసికి సుమారు 654 కిలో మీటర్ల దూరం ఉంది. అయినా, వెరవకుండా తన ఇద్దరు స్నేహితులతో కలిసి రాయ్‌పూర్ నుంచి వారణాసికి బయలుదేరాడు.వారు వెళ్లే దారిలో అక్కడక్కడ రోడ్డుపై వెళ్లే వాహనాలను ఆపి, లిఫ్ట్ అడుగుతూ ముందుకు వెళ్తున్నారు. ఇలా మూడు రోజుల ప్రయాణం అనంతరం ఛత్తీస్‌గఢ్‌లో 350 కిలోమీటర్ల దూరంలోని బైకుంఠపూర్‌‌కు చేరుకున్నారు. అక్కడే ఉన్న మీడియా వీరిని పలకరించగా విషయం వెలుగులోకి వచ్చింది. నడుస్తూ, లిఫ్ట్ అడుగుతూ ఇప్పటికే సగం దూరం చేరుకున్నామని, ఇలాగే చేస్తూ వారణాసికి చేరుకుంటామని వారు చెప్పారు.



కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు