తెలంగాణలో తొలి కరోనా మృతి ; కోవిడ్ కేసులు 65


                                                                                                      ఖైరతాబాద్‌కు చెందిన ఆయన వయసు 74 ఏళ్లు అని తెలుస్తోంది. కుత్బుల్లాపూర్‌లో ఒకే కుటుంబానికి చెందిన మరో ఐదుగురికి కోవిడ్ సోకిందని ఈటల తెలిపారు. చనిపోయిన వ్యక్తి, ఈ ఐదుగురితో కలిపితే.. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 65కు చేరిందన్నారు.




తెలంగాణలో తొలి కరోనా మరణం శనివారం నమోదైందని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేంద్ర తెలిపారు. అనారోగ్యం బారిన పడిన ఓ వ్యక్తి హైదరాబాద్‌లోని గ్లోబల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించాడని తెలిపారు. తర్వాత శాంపిళ్లను సేకరించి పంపగా ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలిందన్నారు. ఖైరతాబాద్‌కు చెందిన ఆయన వయసు 74 ఏళ్లు అని తెలుస్తోంది. కుత్బుల్లాపూర్‌లో ఒకే కుటుంబానికి చెందిన మరో ఐదుగురికి కోవిడ్ సోకిందని ఈటల తెలిపారు.                                                                                                                                                      చనిపోయిన వ్యక్తి, ఈ ఐదుగురితో కలిపితే.. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 65కు చేరిందన్నారు.కరోనా  వైరస్  గురించి తప్పుడు వార్తలను ప్రచారం చేయొద్దని ఈటల కోరారు. ఒకే కుటుంబంలో ఎక్కువ కేసులు నమోదు కావడం వల్లే తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య పెరిగిందని మంత్రి స్పష్టం చేశారు. శనివారం కేరళలోనూ తొలి కరోనా మరణం నమోదైన సంగతి తెలిసిందే. కొచ్చిన్‌కు చెందిన 69 ఏళ్ల వృద్ధుడు కోవిడ్ కారణంగా ప్రాణాలు వదిలాడు.





కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు