ప్రధాన కంటెంట్‌కు దాటవేయి
కరోనా వ్యాధి పై శిక్షణ
- కాకినాడ ;శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారివారి కార్యాలయ సమావేశమందిరమునందు పి.హెచ్.సి మరియు పి.పి.యూనిట్ లలో పనిచేయుచున్న వైద్యాధికారులకు కరోనా వైరస్ వ్యాధిపై శిక్షణ నిర్వహించినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డా. బి.సత్యసుశీల తెలియజేశారు. ఈ శిక్షణా కార్యక్రమములో ఎస్.పి.ఎం. ప్రొఫెసర్ డాక్టర్. కె. అర్జునరావు ఎపిడమోలజికల్ సర్వే గురించి, వైరలజీ ప్రొఫెసర్ డాక్టర్. డి.ఎస్. మూర్తి శాంపెల్ కలెక్షన్ పాకేజ్ అండ్ ట్రాన్స్ పోర్ట్ గురించి వివరించారు. డి.ఐ.ఓ. మరియు జిల్లా సర్వేలెన్స్ అధికారి డా. మల్లిక్ ఇంటింటా సర్వే నిర్వహణ, వ్యాధి వ్యాప్తి చెందకుండా తీసుకోవలసిన చర్యలు, జాగ్రత్తలు మరియు అనుమానిత కేసుల పట్ల సమాచార సేకరణ మరియు అనుమానిత వ్యక్తులు 28 రోజులపాటు ఇంటివద్దనే వుండేలా తీసుకోవలసిన చర్యల గురుంచి శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణలో పిపిఇ (పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్కుప్మెంట్ ) కిట్ ను ధరించుట, వినియోగించుట మరియు క్రిమిరహితము చేయుట అనే విధానముపై జిల్లా ఎపిడమోలజిస్ట్ డా.రవి కుమార్ వివరించారు. విదేశాలనుండి వచ్చిన అనుమానిత వ్యక్తులు వివరములను టోల్ ఫ్రీ నంబరు 1800 425 3077 కు తెలియపరచాలని కోరారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి