కరోనా వైరస్ ఉనికి నిరోధానికి ప్రామాణిక జాగర్తలు చేపట్టాము ;కలెక్టర్
తూ.గో ;జిల్లాలో కరోనా వైరస్ ఉనికి నిరోధానికి అవసరమైన ప్రామాణిక జాగ్రత్తలు అన్నిటినీ సమగ్రంగా చేపట్టామని జిల్లా కలెక్టర్ డి.మురళీధరరెడ్డి తెలియజేశారు. బుధవారం సాయంత్రం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని జిల్లా కలెక్టర్లు, పోలీస్ సూపరింటెండెంట్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కరోనా వైరస్, బిడ్-19 నిరోధానికి చేపట్టవలసిన కార్యాచరణ ప్రణాళికలను సూచించారు. ఈ సందర్భంగా కరోనా వైరస్ అనుమానిత కేసులు తారసపడితే వైరస్ వ్యాప్తి నిరోధానికి జిల్లాల్లో రాపిడ్ యాక్షన్ టీములను ఏర్పాటు చేయాలని ఆమె సూచించారు. అనుమానిత కేసులను ఐసోలేషన్లోను, వాటిలో ఏవైనా నిర్ధారితమైతే కంటైన్ మెంట్ లోను సంబంధిత వ్యక్తులను నిర్దిష్ట కాలం పాటు ఉంచేందుకు అవసరమైన ఏర్పాట్లు సిద్ధం చేయాలని కోరారు. కరోనా వైరస్ ఉనికి గుర్తించిన దేశాల నుండి విమానాలు, నౌకల ద్వారా రాష్ట్రానికి వచ్చే స్వదేశీయులు, విదేశీయులను తప్పని సరి సర్వేలైన్‌లో ఉంచాలని, అనుమానిత కేసులను క్వారంటైన్ లో ఉంచాలని ఆదేశించారు. కరోనా వైరస్ ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లాల్లో వివిధ శాఖల అధికారులు, సిబ్బందితో 18 రకాల ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి సదా సంసిద్ధంగా ఉంచాలని, ప్రతి శాఖ నుండి ఒక నోడల్ అధికారిని నియమించాలని సూచించారు.
కరోనా వైరస్ కేసులను సురక్షిత వైద్య పర్యవేక్షణకు ప్రభుత్వ, ప్రయివేట్ వైద్యులు, సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కల్పించాలని ఆదేశించారు. ఐసోలేషన్, కంటైన్మెంట్ కేంద్రాల పరివృత ప్రాంతాలను పోలీస్ రక్షణ లో ఉంచాలని ఎపిలను కోరారు. కరోనా వైరస్ గురించి ప్రజల్లో భయాందోళనలు కలుగకుండా మీడియా సామాజిక బాధ్యతతో వార్తలు ప్రచురించేలా కోరాలన్నారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ డి.మురళీధరరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకూ తారసపడిన మూడు కేసులు ఎటువంటి వైరస్ సోకినవి కావని నిర్థారణ అయిందని, మంగళవారం రాత్రి గమనించిన అనుమానిత కేసును కాకినాడ ఆసుపత్రికి తరలించి సురక్షిత వైద్య పర్యవేక్షణలో ఉంచామన్నారు. సదరు వ్యక్తి సంచరించిన ప్రాంతాల్లోని 6 వేల మంది ప్రజలకు డోర్ టు డోర్ పరిశీలనల ద్వారా నిశితంగా స్క్రీనింగ్ నిర్వహించామని, 7గురు వ్యక్తులలో సాధారణ జలుబు పరిశీలనల ద్వారా నిశితంగా స్క్రీనింగ్ నిర్వహించామని, 7గురు వ్యక్తులలో సాధారణ జలుబు లక్షణాలు మినహా ఎటువంటి సూచనలు గుర్తించలేదని తెలిపారు. అనుమానిత, నిర్థారిత కేసులను ప్రామాణిక విధానంలో క్వారంటైన్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పటిష్టంగా సిద్ధంగా చేశామని తెలిపారు.
మంగళవారం రాత్రి అనుమానిత కేసు వచ్చిన వెంటనే తాను, ఎపి వెంటనే అప్రమత్తమై అవసరమైన చర్యలు చేపట్టామని తెలియజేశారు. ప్రజలను భయబ్రాంతులను చేసే వార్తా కథనాలు మీడియాలో ప్రచురణ, ప్రసారాలు చేయకుండా సంయమనంతో రిపోర్ట్ చేయాలని మీడియా ప్రతినిధులను కోరామన్నారు. కరోనా వైరస్ వల్ల ఉత్పన్నమయ్యే ఎటువంటి పరిస్థితులనైనా సమర్థవంతంగా ఎదుర్కోనేందుకు వివిధ శాఖల అధికారులు, సిబ్బందితో ప్రత్యేక టీములు ఏర్పాటు చేసి, తగు అవగాహన, శిక్షణ కల్పిస్తున్నామని తెలిపారు. , ఈ సమావేశంలో జిల్లా ఎస్ పి అద్నాన్ నయీమ్ అస్మి, జాయింట్ కలెక్టర్ జి.లక్ష్మీశ, డిసి హెచ్ ఎస్ డా. రమేష్ కిషోర్ , జి హెచ్ సూపరింటెండెంట్ డా. రాఘవేంద్రరావు, డిఐఓ డా. మల్లిక్, సమాచార శాఖ డిడి మనోరంజన్, వైద్య అధికారులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి