55 ఏళ్ల ‘తేనెమనసులు’కృష్ణ సినిమాపై మహేష్ ఆసక్తికర పోస్ట్
సూపర్ స్టార్ కృష్ణ పేరు చెప్పగానే మనకు ఆయన ఆరడుగుల అందం కళ్లలో మెదులుతుంది. ఆయన ఇండస్ట్రీకి పరిచయం చేసిన కొత్త టెక్నాలజీలు గుర్తుకు వస్తాయి.ఇదిలా ఉంటే, ఈరోజు (మార్చి 31న) ‘తేనెమనసులు’ సినిమా 55వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా కృష్ణ తనయుడు, స్టార్ హీరో మహేష్ బాబు తన ఆనందాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు.
ఇదిలా ఉంటే, ఈరోజు (మార్చి 31న) ‘తేనెమనసులు’ సినిమా 55వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా కృష్ణ తనయుడు, స్టార్ హీరో మహేష్ బాబు తన ఆనందాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు. ఆ సినిమాను ప్రేక్షకులకు గుర్తుచేశారు. ఈ సినిమా తనకు ఆల్‌టైమ్ ఫేవరేట్ అని చెప్పారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ చేశారు. ‘‘నాకు ఎప్పటికీ ఇష్టమైన సినిమా. మరిచిపోలేని క్లాసిక్. మన ఎవర్‌గ్రీన్ సూపర్ స్టార్ కృష్ణ గారి ప్రయాణం 55 ఏళ్ల క్రితం ఇదే రోజు ‘తేనెమనసులు’తో మొదలైంది. బ్లాక్ బస్టర్ సినిమాతో ప్రయాణం మొదలుపెట్టారు. సూపర్ స్టార్ లెజండరీ జర్నీలోకి ఒక్క క్షణం వెనక్కి వెళ్దాం’’ అని మహేష్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
కాగా, సూపర్ స్టార్ కృష్ణ నటుడిగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా తెలుగు సినీ పరిశ్రమలో తన ముద్ర వేశారు. పద్మాలయా స్టూడియోస్ బ్యానర్‌లో ఆయన ఎన్నో సినిమాలను నిర్మించారు. 16 సినిమాలకు దర్శకత్వం వహించారు. ‘మోసగాళ్లకు మోసగాడు’ (1971) సినిమాతో కౌబోయ్ జానర్‌ను టాలీవుడ్‌కు పరిచయం చేశారు. అంతేకాదు తొలి ఈస్ట్‌మన్ కలర్ సినిమా (ఈనాడు - 1982), తొలి సినిమాస్కోప్ ఫిల్మ్ (అల్లూరి సీతారామరాజు - 1974), తొలి 70 ఎంఎం సినిమా (సింహాసనం - 1986), తొలి డీటీఎస్ మూవీ (తెలుగు వీర లేవరా - 1995)లను పరిచయం చేసిన ఘనత ఆయనదే.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి