
ప్రపంచ ఆర్థికవ్యవస్థకు కరోనా దెబ్బ మామూలుగా తగలట్లేదు. ప్రాణ నష్టంతో పాటు వాణిజ్య వ్యవస్థను కూడా కరోనా వైరస్ కాటేస్తోంది. వైరస్ ప్రభావంతో అంతర్జాతీయ వ్యాపారం, వాణిజ్యం మూలాలపై దాడి జరుగుతోంది. ఈ వైరస్ వలన ఇప్పటివరకు ప్రపంచ ఆర్థికవ్యవస్థ సుమారు 350 లక్షల కోట్ల మేర నష్టపోయినట్లు అంచనా వేస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద మాన్యుఫాక్చరింగ్ హబ్ అయిన చైనాలో పరిశ్రమలు ఉత్పతులను ఆపేశాయి. వైరస్ బారిన పడకుండా ఉండటానికి చైనా ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. ప్రపంచంలోని అన్ని బ్రాండెడ్ సంస్థలన్నీ చైనాలో తమ ఉత్పత్తి ప్లాంట్లను కలిగి ఉండగా, ఉత్పత్తి కేంద్రాల్లో పనులు నిలిచిపోవడంతో నష్టాలను ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది.

అంతేకాదు ప్రపంచ పర్యాటకరంగం కూడా కరోనా ధాటికి కుప్పకూలిపోయింది. ప్రపంచ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో పర్యాటక రంగానిదే 10.4 శాతం కావడం గమనార్హం. కరోనా వైరస్ భయంతో ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు తమ పర్యటనలను రద్దు చేసుకుంటున్నారు. ఇక అటు ఆసియా దేశాల్లో పర్యటనలు దాదాపు నిలిచిపోయాయి. ఇక చైనా పర్యాటకులను దాదాపు అన్నిదేశాలు నిషేధించాయి. ప్రపంచ ఆర్థికవ్యవస్థలో సుమారు 8.8 ట్రిలియన్స్‌గా ఉన్న పర్యాటకరంగ ఆదాయం ఈ సంవత్సరం భారీగా పడిపోయే అవకాశాలు ఉందని ప్రపంచ ట్రావెల్ అండ్ టూరిజం కౌన్సిల్ ఇప్పటికే పేర్కొంది. మరోవైపు మన దేశంలో సైతం విమానయాన సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటామని ఇప్పటికే హామీ ఇచ్చింది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి